నాణ్యతను తేల్చేస్తుంది!

వర్షాకాలంలో... ఆకుకూరలు, కాయగూరలు, చేపలు, మాంసాహారంపై బ్యాక్టీరియా ఎక్కువగా వృద్ధి చెందుతూ ఉంటుంది. అందుకే ఫ్రిజ్‌లోంచి తీసిన వెంటనే లేదా బజారు నుంచి తెచ్చిన వెంటనే వండేయడానికి సిద్ధపడిపోకుండా కాస్త వాటి నాణ్యతను ఆరాతీయండి

Updated : 03 Jul 2022 05:51 IST

వర్షాకాలంలో... ఆకుకూరలు, కాయగూరలు, చేపలు, మాంసాహారంపై బ్యాక్టీరియా ఎక్కువగా వృద్ధి చెందుతూ ఉంటుంది. అందుకే ఫ్రిజ్‌లోంచి తీసిన వెంటనే లేదా బజారు నుంచి తెచ్చిన వెంటనే వండేయడానికి సిద్ధపడిపోకుండా కాస్త వాటి నాణ్యతను ఆరాతీయండి. అదెలా అంటారా? ఇందుకోసం డిజిటల్‌ ఫుడ్‌ టెస్టర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మాంసం, పండ్లు, కాయగూరలని ఈ టెస్టర్‌తో గుచ్చి చూస్తే చాలు. ఇందులో మోతాదుకు మించి క్రిమిసంహారాల వాడకం ఉంటే ఆ విషయాన్ని తెరపై చూపిస్తుంది. అలాగే నీళ్ల పరిశుభ్రతనూ చిటికెలో చెప్పేస్తుంది. ఇవేకాదు బ్యాక్టీరియా వంటివి ఉంటే వాటినీ పసికట్టేస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని