Updated : 03 Jul 2022 05:57 IST

కూర బొకేలు!

ఎవరినైనా పలకరించడానికి వెళ్లినప్పుడు బొకేలు తీసుకెళ్తుంటాం. కానీ ఈ మధ్య అవతలి వారి మనసు దోచుకొనేందుకు వారికిష్టమైన కూరగాయలు, మాంసాహారంతో కూరబొకేల్ని అందిస్తున్నారు. ‘కూరబొకేలా!’ అని ఆశ్చర్యపోకండి. పూలకు బదులుగా... స్నేహితులకి నచ్చిన రొయ్యలు, చేపలు, కూరగాయలు, గింజలు ఒక్కటేంటి తినడానికి ఇష్టపడే పదార్థాల్ని... వాటిని వండుకోవడానికి అవసరమైన దినుసులతో సహా బొకేలుగా మలిచి ఇస్తున్నారు. ఇదేదో బాగానే ఉందిగా!

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts