Updated : 17 Jul 2022 07:33 IST

Samosa: బాహుబలి సమోసా.. తింటే అరలక్ష!

మోసా తింటే.. రూ. యాభైవేల బహుమతి! ఇదేదో బాగుందే ఓ నాలుగు సమోసాలు తిందాం... రెండులక్షలు వెనకేసుకుందాం అనుకుంటున్నారా? అయితే మీరనుకున్నంత ఈజీ కాదు.

ఈ సమోసా ఎనిమిది కేజీల బరువుంటుంది... అయినా ఏదోలా కష్టపడి తినేద్దాం అనుకుంటున్నారా? అబ్బే అరగంటలో తింటేనే బహుమతి ఇస్తారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో ఉన్న కౌశల్‌ మిఠాయి దుకాణం వాళ్లు ఈ ఛాలెంజ్‌ని విసిరారు. నిజానికి ఇదేం మొదటి మొదటి ఛాలెంజ్‌ కాదు ఇంతకు ముందు కూడా నాలుగు కేజీల సమోసా కోసం ఓ ఛాలెంజ్‌ని చేశారు. ఆ ఛాలెంజ్‌ని ఆహారప్రియులు విజయవంతంగా పూర్తిచేయడంతో ఈ షాప్‌ యజమాని సుభమ్‌కౌశల్‌ ఈ బాహుబలి సమోసా ఛాలెంజ్‌తో ఆహారప్రియుల నోరూరిస్తున్నాడు. దీని ధర రూ.1100. చేయడానికి గంటన్నరకుపైగా పడుతుందట. ఆలూ, బఠానీ, చీజ్‌ వంటివి వేసి చేసే దీనిని 30 మంది వరకూ తినొచ్చు. దీనిని తినడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారట. ఈ ఛాలెంజ్‌ని కూడా ఎవరైనా విజయవంతంగా పూర్తిచేస్తే పదికేజీల సమోసా ఛాలెంజ్‌ని విసురుతా అంటున్నాడు సుభమ్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts