Published : 24 Jul 2022 01:25 IST

పాత టీ పాత్రలు.. కొత్తగా!

చినుకులకి సరైన కాంబినేషన్‌ అంటే వేడివేడి టీనే. ఈ టీని కాచడానికి.. పాతకాలంలో సమోవర్లు అనే ప్రత్యేక పాత్రలుండేవి. రష్యాలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన ఈ సమోవర్లు... ఇప్పటికీ తమిళనాడులో కనిపిస్తాయి. రాగితో చేసిన ఈ సమోవర్లలో మధ్యలో బొగ్గులు వేసి వెలిగిస్తారు. ఆ వేడికి చుట్టు ఉన్న నీరు మరుగుతుంది. ఆ నీటితో టీకాస్తారు. ఈ సమోవర్లు కాస్తా ఆధునిక రూపం సంతరించుకున్నాయి. విద్యుత్‌తో పనిచేసే సమోవర్లు తిరిగి మార్కెట్లో దొరుకుతున్నాయి. చూడ్డానికి మాత్రం పాత సమోవర్ల మాదిరిగానే కనిపిస్తూ ఇంట్లో చక్కని అలంకరణ వస్తువులుగా సందడి చేస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts