వెదురు ఉప్పు.. ఖరీదెంతో తెలుసా?

కొరియా వెదురు ఉప్పు గురించి ఎప్పుడైనా విన్నారా? ప్రపంచంలోని ఖరీదైన ఉప్పుల్లో ఇదీ ఒకటి. పావుకిలో ఎనిమిదివేల రూపాయల పైమాటే. అమ్మో అంత ఖరీదా! ఏంటో అంత ప్రత్యేకం అంటారా?

Published : 24 Jul 2022 01:25 IST

కొరియా వెదురు ఉప్పు గురించి ఎప్పుడైనా విన్నారా? ప్రపంచంలోని ఖరీదైన ఉప్పుల్లో ఇదీ ఒకటి. పావుకిలో ఎనిమిదివేల రూపాయల పైమాటే. అమ్మో అంత ఖరీదా! ఏంటో అంత ప్రత్యేకం అంటారా? వంటకం అంతా అయ్యాక చివరిగా ఫినిషింగ్‌ సాల్ట్‌గా వాడే ఈ వెదురు ఉప్పులో ఎన్నో ఔషధ గుణాలున్నాయని వందల సంవత్సరాలుగా కొరియన్లు నమ్ముతున్నారు. చర్మం ఆరోగ్యంగా కనిపించడానికీ, క్యాన్సర్‌ రాకుండా ఉండేందుకు, దంతాల ఆరోగ్యానికీ దీనిని మించిన ఔషధం లేదన్నది వారి నమ్మకం. అయితే ఈ ఉప్పు తయారీకి చాలా సమయం పడుతుందట. ఎక్కడా యంత్రాలని వాడకుండా, కార్మికులు చేత్తో చేస్తారు కాబట్టే అంత ఖరీదు. మూడేళ్ల వయసున్న వెదురు బొంగులని సేకరించి వాటిని సమానంగా కత్తిరిస్తారు. వాటిల్లో సముద్ర ఉప్పుని నింపి... 800 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కాలుస్తారు. ఈ క్రమంలో వెదురు నుంచి వెలువడిన ద్రవాలు ఉప్పుతో కలుస్తాయి. ఇది మొదటి దశ. ఇలా సేకరించిన ఉప్పుని మళ్లీ వెదురులో ఉంచి మళ్లీ అదే ఉష్ణోగ్రత వద్ద వేడిచేస్తారు. ఇలా ఎనిమిది సార్లు చేస్తారు. తొమ్మిదో సారి ఉప్పుని 1000 డిగ్రీల దగ్గర కాలుస్తారు. అప్పటికి ఉప్పు ఉదారంగు స్పటిక రూపంలోకి మారుతుంది. ఈ క్రమంలో ఎక్కడ నిర్లక్ష్యంగా ఉన్నా అది స్పటిక రూపంలోకి మారదు. అందుకే చాలా జాగ్రత్తగా ఈ ఉప్పుని తయారుచేస్తారు. ఇప్పుడర్థమయిందా ఈ ఉప్పు ఎందుకంత ఖరీదో! దీనికున్న ప్రత్యేకమైన రంగు కారణంగా.. పర్పుల్‌ సాల్ట్‌ అని కూడా అంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని