అనాసతో ఆ ఆసక్తి...

అనాసలో బీటాకెరటిన్, జింక్, కాపర్‌ వంటి శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ చేసే హానిని తగ్గించి సంతాన సాఫల్య సామర్థ్యాన్ని పెంచుతాయి. స్త్రీ, పురుషులు ఇద్దరికీ ఇది మేలు చేస్తుంది.

Updated : 14 Aug 2022 03:32 IST

అనాసలో బీటాకెరటిన్, జింక్, కాపర్‌ వంటి శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ చేసే హానిని తగ్గించి సంతాన సాఫల్య సామర్థ్యాన్ని పెంచుతాయి. స్త్రీ, పురుషులు ఇద్దరికీ ఇది మేలు చేస్తుంది. ఎండ, కాలుష్యం కారణంగా పాడైన చర్మాన్ని రక్షించడంలో అనాస ముందుంటుంది. ముఖ్యంగా చర్మంలో సాగే గుణం కోల్పోకుండా చేసి ముడతలు రానీయదు. అనాసని తరచూ తినేవారిలో వయసు పైబడిన దాఖలాలు పెద్దగా కనిపించవు.

దీనిలోని బ్రొమిలిన్‌ అనే ఎంజైమ్‌... జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేసేట్టు చూస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలు రానీయకుండా చేస్తుంది. అలాగే బ్రొమిలిన్‌ అంతర్గత వాపులని తగ్గిస్తుంది. గాయాలు త్వరగా మానడానికి సహకరిస్తుంది. సర్జరీల తర్వాత వాటి నుంచి కోలుకోవడానికి అనాస సహకరిస్తుంది. అయితే అనాసని ఎలా తినాలనే సందేహం ఉంటుంది చాలామందికి. జ్యూసుల రూపంలో తాగొచ్చు. లేదంటే సలాడ్ల రూపంలో. కాస్తంత చాట్‌మసాలా చల్లి కబాబ్‌ల మాదిరిగా కాల్చుకుని తిన్నా రుచిగా ఉంటాయి.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని