తరిగేద్దాం... తేలిగ్గా!

కాయగూరలు తరిగేటప్పుడు పెద్దవీ చిన్నవీ కాకుండా ఒక పద్ధతిలో కోస్తే కూర చూడ్డానికి బాగుంటుంది. అలా చేయాలంటే మన కటింగ్‌ స్కిల్స్‌ బాగుండాలి. అంత తీరిక కూడా ఉండాలి.

Published : 28 Aug 2022 00:23 IST

కాయగూరలు తరిగేటప్పుడు పెద్దవీ చిన్నవీ కాకుండా ఒక పద్ధతిలో కోస్తే కూర చూడ్డానికి బాగుంటుంది. అలా చేయాలంటే మన కటింగ్‌ స్కిల్స్‌ బాగుండాలి. అంత తీరిక కూడా ఉండాలి. మనలో చాలామందికి ఆఫీసు టైం అవుతోంది అనే తొందరలోనే పనిచేస్తాం. అందుకే తక్కువ సమయంలో పని తేలిగ్గా అయ్యేందుకు ఉపకరించే పరికరమే ఈ రొటేటింగ్‌ వెజిటబుల్‌ కట్టర్‌. క్యారట్‌, బీట్‌రూట్‌ వంటి ఎక్కువ సమయం పట్టే కాయగూరల్ని కూడా ఇందులో తేలిగ్గా తరిగేయొచ్చు. నాలుగు రకాల బ్లేడులు మార్చుకొనే అవకాశం ఉంది. దీనికున్న ప్రత్యేకమైన ఆకృతివల్ల చేతివేళ్లకి గాయం అవుతుందున్న భయం లేకుండా వేగంగా పని పూర్తిచేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని