చర్మ సమస్యలున్నాయా వెలగ తినండి!

వెలగపపండు లేనిదే వినాయకపూజ సంపూర్ణం కాదు. ఈ సీజన్‌లో ఎక్కువగా దొరికే వెలగపండ్లు పోషకాల్లోనూ, రుచిలోనూ ప్రత్యేకమైనవి...

Updated : 04 Sep 2022 10:24 IST

వెలగపపండు లేనిదే వినాయకపూజ సంపూర్ణం కాదు. ఈ సీజన్‌లో ఎక్కువగా దొరికే వెలగపండ్లు పోషకాల్లోనూ, రుచిలోనూ ప్రత్యేకమైనవి...
* శరీరంలోని వ్యర్థాలను బయటకు నెట్టి... రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఈ పండుకి ఉంది. వెలక్కాయలో నిరోధకశక్తిని పెంచే  సిట్రిక్‌ ఆమ్లాలు, రెబోఫ్లావిన్‌, బీటాకెరొటిన్‌, ఫాస్పరస్‌,  థయామిన్‌, కాల్షియం, ఇనుము సమృద్ధిగా ఉన్నాయి.
* ఈ పండు అకాల వృద్ధాప్యాన్ని దరిచేయనీయదు. మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పీచు సమృద్ధిగా ఉండటం వల్ల మలబద్ధకం రాకుండా ఉంటుంది. ఈ సమస్యతో బాధపడేవారికి ఇదో దివ్య ఔషధమనే చెప్పొచ్చు.
* గాయాలను త్వరగా నయం చేస్తుంది. చర్మ సమస్యలున్న వారు ఈ పండుని తరచూ తింటే ప్రయోజనం ఉంటుంది.
* నీరసంగా ఉన్నప్పుడు వెలక్కాయను తింటే తక్షణ శక్తి లభిస్తుంది. జలుబు, ఆస్త్మా వంటి శ్వాస కోశ వ్యాధులను తగ్గించటంలో సమర్ధమంతంగా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. ఎన్ని ప్రయోజనాలున్నా మితంగా తినాలి సుమా.
వగరుగా, పుల్లగా ఉండే ఈ వెలగపండుతో.. గోదావరి జిల్లాల్లో జీలకర్ర, బెల్లం వేసి రుచికరమైన పచ్చడి చేస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని