ఉడికించే బాధలుండవిక!

కాయగూరల్ని ఆవిరిమీద ఉడికించాలంటే ఏం చేస్తాం? ఒక పాత్రలో నీళ్లుపోసి.. ఆ పాత్రలోకి సరిగ్గా ఫిట్‌ అయ్యే మరో పాత్రని తీసుకుంటాం.

Published : 04 Sep 2022 00:27 IST

కాయగూరల్ని ఆవిరిమీద ఉడికించాలంటే ఏం చేస్తాం? ఒక పాత్రలో నీళ్లుపోసి.. ఆ పాత్రలోకి సరిగ్గా ఫిట్‌ అయ్యే మరో పాత్రని తీసుకుంటాం. మళ్లీ దాన్లోకి నీళ్లు పోకుండా కింద మరో గిన్నెని బోర్లించాలి. వెజిటబుల్‌ స్టీమర్‌ బాస్కెట్‌ మీ దగ్గరుంటే.. ప్రతి సారీ ఇంత కష్ట పడాల్సిన అవసరం లేదు. ఈ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ బాస్కెట్‌ని కావాలంటే వెడల్పు చేసుకోవచ్చు. వద్దనుకుంటే పాత్రకు తగ్గట్టుగా చిన్నదిగా మార్చుకోవచ్చు. రంధ్రాలుండటంవల్ల దీన్లో నీళ్లు చేరే అవకాశం లేదు. ఉడికించిన తర్వాత బాస్కెట్‌ని బయటకు తీయడానికి వీలుగా ఒక హుక్‌ ఉంటుంది. చేతికి ఆవిరిపట్టకుండా బాస్కెట్‌ని తేలిగ్గా బయటకు తీసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని