రోలు, కల్వం కొత్తగా!

ఎన్ని చెప్పండి.. రోట్లో రుబ్బిన పచ్చడి రుచే వేరు! ఇప్పుడన్నీ మిక్సీలేగా... రోళ్లు, రోకళ్లు ఎక్కడివి అంటారా? అదీ నిజమే. కానీ ఆపాత రుచిని మరిచిపోలేని వారు కొత్త ప్రయోగం చేస్తున్నారు.

Published : 11 Sep 2022 00:42 IST

న్ని చెప్పండి.. రోట్లో రుబ్బిన పచ్చడి రుచే వేరు! ఇప్పుడన్నీ మిక్సీలేగా... రోళ్లు, రోకళ్లు ఎక్కడివి అంటారా? అదీ నిజమే. కానీ ఆపాత రుచిని మరిచిపోలేని వారు కొత్త ప్రయోగం చేస్తున్నారు. రోలు, సన్నికల్లు వంటివాటిని తెచ్చి.. చక్కగా వంటింట్లో అమర్చుకుంటున్నారు. ప్రత్యేకంగా గట్టు కట్టించి కొంత ఎత్తులో వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. పచ్చళ్లు వంటివాటిని కింద కూర్చుని రుబ్బాల్సిన అవసరం లేకుండానే రుబ్బడం, దంచడం వంటివి చేస్తూ రోటి పచ్చడి రుచిని ఆస్వాదిస్తున్నారు. ఈ ఏర్పాటేదో బాగుంది కదా! రుచికి...రుచి. వ్యాయామానికి... వ్యాయామం. విద్యుత్‌ ఆదా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని