త్రిఫలప్రదం...

చీటికీమాటికీ వేధించే జలుబు, దగ్గు వంటి వాటి నుంచి ఉపశమనం మాత్రమేకాదు... అజీర్తి వంటి సమస్యలు తగ్గి మనం చురుగ్గా ఉండాలన్నా త్రిఫల చూర్ణం భలేగా ఉపయోగపడుతుంది..

Published : 18 Sep 2022 00:51 IST

చీటికీమాటికీ వేధించే జలుబు, దగ్గు వంటి వాటి నుంచి ఉపశమనం మాత్రమేకాదు... అజీర్తి వంటి సమస్యలు తగ్గి మనం చురుగ్గా ఉండాలన్నా త్రిఫల చూర్ణం భలేగా ఉపయోగపడుతుంది..
* త్రిఫలాలు అంటే.. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ. వీటితో చేసిన చూర్ణం మనకి మార్కెట్‌లో దొరుకుతుంది. ఈ చూర్ణానికి యాంటీ ఏజింగ్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు అధికం. దీనిని నిదుర పోయేముందు గోరువెచ్చని నీళ్లతో తీసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.


తరచూ చిగుళ్లు వాస్తున్నా, దంతాల నుంచి రక్తస్రావమవుతున్నా.. ఈ చూర్ణం కలిపిన నీళ్లతో నోటిని పుక్కలిస్తే ప్రయోజనం ఉంటుంది. దంతాలపై పేరుకున్న గార కూడా తొలగిపోతుంది.
పొట్ట, పిరుదుల భాగంలో పేరుకున్న కొవ్వు చాలామందిని వేధించే సమస్య. రోజూ త్రిఫల చూర్ణాన్ని తీసుకొంటే పొట్ట దగ్గరి కొవ్వు సులభంగా కరిగిపోతుందట. దీని పరగడపున తీసుకుంటే ప్రయోజనాలు ఎక్కువగా అందుతాయట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని