ఇలా చేస్తే .. పోషకాలే పోషకాలు..

ఎంత తిన్నామన్నది ముఖ్యం కాదు.. ఎన్ని ఎక్కువ పోషకాలు తీసుకున్నామన్నది ముఖ్యం. దీన్నే ‘న్యూట్రియంట్‌ డెన్స్‌ ఆహారం అంటున్నారు చెఫ్‌ చిను వాజ్‌.

Published : 25 Sep 2022 00:52 IST

ఎంత తిన్నామన్నది ముఖ్యం కాదు.. ఎన్ని ఎక్కువ పోషకాలు తీసుకున్నామన్నది ముఖ్యం. దీన్నే ‘న్యూట్రియంట్‌ డెన్స్‌ ఆహారం అంటున్నారు చెఫ్‌ చిను వాజ్‌. మనం తినే రోజువారీ ఆహారాన్ని కూడా పోషకభరితం చేసుకోవడానికి కొన్ని చిట్కాలు చెబుతున్నారామె...

* మునగ, ఉసిరి, స్పైరులీనా ఇందులో ఏ పొడినైనా సరే... మీరు తాగే సూపుల్లో, స్మూతీల్లో కొద్దిగా చేర్చుకోండి. లేదంటే చపాతీపిండి కలుపుతున్నప్పుడు అందులో కొద్దిగా కలపండి. రుచిలో తేడా రాదు. పోషకాలు అందుతాయి.
* ఎగ్‌లెస్‌ బేకింగ్‌ చేస్తున్నప్పుడు.. అందులో అవిసెగింజల పొడిని ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. పోషకాలు కూడా అందుతాయి. అవిసె గింజలని వేయించి పొడికొట్టి.. దానిని పండ్లముక్కలపై చల్లుకోండి. సులభంగా ఒమెగా త్రీ పోషకాలు అందుతాయి.
* ఓట్స్‌ తినే అలవాటుందా? పోనీ రాగి జావ తాగుతారా? అయితే వాటిల్లో ఒక అరచెంచా డ్రైఫ్రూట్స్‌ ముక్కలని కలపండి. అవి ఎనర్జీ బాంబ్స్‌. తక్షణ ఉత్తేజాన్ని ఇస్తాయి.
* ఉదయం చేసే పచ్చడి.. సాయంత్రం పిల్లలకోసం చేసే లడ్డూ ఇలా తాజా కొబ్బరిని వాడటానికి ఏ సందర్భం వచ్చినా వదులుకోవద్దు. కొబ్బరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
* నూడుల్స్‌, ఫ్రైడ్‌రైస్‌...దోసెలు ఎక్కడ గుడ్డు వాడటానికి అవకాశం ఉన్నా ఓ గుడ్డుని కొట్టి వేసేయండి. ఆరోగ్యాన్ని ఆహ్వానించండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని