పిల్లల కోసం...

ఇంట్లో పసిపిల్లలున్నారా? అయితే మీకు బాగా అర్థమవుతుంది. వాళ్లకోసం పెట్టే కొద్దిపాటి ఆహారాన్ని మళ్లీ మళ్లీ వేడి చేయడం ఎంత కష్టమో! ఆ చిన్ని పొట్టకి కావాల్సిన ఆహారాన్ని పెద్ద గిన్నెల్లో వేడిచేయలేం. వేడిచేసినా అందులోని పోషకాలు తరిగిపోయే ప్రమాదమే ఎక్కువ.

Published : 25 Sep 2022 00:52 IST

ఇంట్లో పసిపిల్లలున్నారా? అయితే మీకు బాగా అర్థమవుతుంది. వాళ్లకోసం పెట్టే కొద్దిపాటి ఆహారాన్ని మళ్లీ మళ్లీ వేడి చేయడం ఎంత కష్టమో! ఆ చిన్ని పొట్టకి కావాల్సిన ఆహారాన్ని పెద్ద గిన్నెల్లో వేడిచేయలేం. వేడిచేసినా అందులోని పోషకాలు తరిగిపోయే ప్రమాదమే ఎక్కువ. ఇలా కాకుండా ఉండటానికే.. మార్కెట్లో ‘లిల్లీపాట్స్‌’ పేరుతో ప్రత్యేకమైన పాత్రలు దొరుకుతున్నాయి. చూడ్డానికి ఇడ్లీ పాత్రలా ఉండే వీటిల్లో ఫ్రిజ్‌లోంచి తీసిన క్యారెట్‌ గుజ్జూ, బంగాళాదుంప గుజ్జూ వంటివాటిని వేడిచేసుకోవడం తేలిక. ఇవి ఆవిరిమీద ఉడుకుతాయి కాబట్టి పోషకాలు పోయే ప్రమాదం తక్కువ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని