Boba tea: భలేభలే.. బోబా టీ!.. దీని గురించి తెలుసా?

బోబా టీ గురించి తెలుసా? గ్రీన్‌ టీ.. బ్లాక్‌ టీ... మనం తాగే సంప్రదాయ కటింగ్‌ చాయ్‌ గురించి కూడా తెలుసు. మరి ఈ బోబా టీ ఏంటి అనుకుంటున్నారా?

Updated : 25 Sep 2022 10:42 IST

బోబా టీ గురించి తెలుసా? గ్రీన్‌ టీ.. బ్లాక్‌ టీ... మనం తాగే సంప్రదాయ కటింగ్‌ చాయ్‌ గురించి కూడా తెలుసు. మరి ఈ బోబా టీ ఏంటి అనుకుంటున్నారా? దీన్నే పెర్ల్‌ టీ అనికూడా అంటారు. ఇప్పుడిప్పుడే మన నగరాల్లో ప్రాచుర్యం పొందుతున్న ఈ బోబా టీ గురించి తెలుసుకుందాం...

బోబాటీనే బబుల్‌టీ అనీ... పెర్ల్‌టీ అని కూడా అంటారు. దీని పుట్టినిల్లు తైౖవాన్‌. మనటీల్లో మాదిరిగా ఇందులోనూ పాలు, టీ, పంచదారనే వాడతారు. అదనంగా నల్లటి బాల్స్‌లాంటి వాటిని వాడతారు. వాటివల్లనే ఈ టీకి బోబా టీ అని పేరొచ్చింది. వీటిని కర్రపెండలం దుంపతో తయారుచేస్తారు. వివిధ రకాల పండ్ల ఫ్లేవర్లతో తయారుచేసిన టీలో.. నానబెట్టిన టాపియోకా గింజలని వేసి తయారుచేస్తారు. పైన జెల్స్‌తో చేసిన టాపింగ్స్‌ కూడా వీటికి అదనపు అందాన్నీ, రుచినీ తీసుకొస్తాయి. ఈ టాపియోకాలని తినడానికి వీలుగా ఇందులో వేసే స్ట్రాలు కూడా ప్రత్యేకంగా, లావుగా ఉంటాయి. తైవాన్‌లో ప్రాచుర్యం పొందిన ఈ టీ ఇప్పుడు మన నగరాల్లో కూడా సందడి చేస్తోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని