కొబ్బరి పాఠాలు చెప్పే బడి!

కొబ్బరికాయ గురించి మీకే మాత్రం తెలుసు? కాయకొట్టి.. పచ్చడి చేయడం, కూరల్లో వాడుకోవడం వరకూ తెలుసుంటుంది. అంతకుమించి కష్టమే! కొబ్బరికాయలో బోలెడు దశలుంటాయి. ఆ దశను బట్టి రుచీ మారుతుంటుంది

Published : 02 Oct 2022 00:02 IST

కొబ్బరికాయ గురించి మీకే మాత్రం తెలుసు? కాయకొట్టి.. పచ్చడి చేయడం, కూరల్లో వాడుకోవడం వరకూ తెలుసుంటుంది. అంతకుమించి కష్టమే! కొబ్బరికాయలో బోలెడు దశలుంటాయి. ఆ దశను బట్టి రుచీ మారుతుంటుంది. ఇలా కొబ్బరి గురించి అనేక విషయాలు చెప్పేందుకు హావాయిలోని మౌఈ ప్రాంతంలో ఓ స్కూలే ఉంది..

హావాయిలోని మౌఈ.. ద్వీప ప్రాంతం. కొబ్బరి చెట్లు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో కోకోనట్‌ టూర్‌లు నిర్వహిస్తుంటారు. కొబ్బరి మీద మరింత అవగాహన తీసుకురావడానికి రేయాన్‌ బర్డన్‌ కోకోనట్‌ ఇన్‌ఫర్మేషన్‌ స్కూల్‌ని నడిపిస్తున్నారు. ఇక్కడ కాయలు దింపు తీయడం దగ్గర నుంచి ముదురు కొబ్బరి కాయలని ఎలా వలవాలో, ఎలా కొట్టాలో కూడా నేర్పిస్తారట. లేత కొబ్బరితో చేసే నూడుల్స్‌ దగ్గర నుంచి ముదురు కొబ్బరితో ఏ వంటకాలు చేసుకోవచ్చో కూడా నేర్పుతారు. వివిధ దశల్లో కొబ్బరి ఎలా ఉంటుంది, దాని రుచి ఎలా మారుతుంటుంది, కొబ్బరిపాలు తీయడం, కూరలు చేయడం వంటివన్నీ ఇక్కడ క్లాసుల్లో నేర్పుతారు. కోకోనట్‌ఇన్‌ఫర్మేషన్‌.కామ్‌ పేరుతో ఇందుకోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ కూడా నడుపుతున్నారు వీళ్లు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని