కప్పు.. అద్దెకిస్తారు!

ఇల్లు అద్దెకివ్వడం తెలుసుకానీ... కప్పు అద్దెకివ్వడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? స్టార్‌బక్స్‌ కాఫీ గురించి తెలుసుకదా! ఈ కాఫీకి.. లోగోతో ఉండే ఆ కాఫీకప్పులే ప్రత్యేకత. కానీ వాడిపారేసే ఈ కప్పులు పర్యావరణానికి చేటు చేయకూడదని

Published : 02 Oct 2022 00:03 IST

ఇల్లు అద్దెకివ్వడం తెలుసుకానీ... కప్పు అద్దెకివ్వడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? స్టార్‌బక్స్‌ కాఫీ గురించి తెలుసుకదా! ఈ కాఫీకి.. లోగోతో ఉండే ఆ కాఫీకప్పులే ప్రత్యేకత. కానీ వాడిపారేసే ఈ కప్పులు పర్యావరణానికి చేటు చేయకూడదని ఆ సంస్థ ఓ మంచి నిర్ణయాన్ని తీసుకుంది. 2030 నాటికల్లా కప్పుల ద్వారా వచ్చే వ్యర్థాలని 50 శాతానికి తగ్గించాలని యోచిస్తోంది. ఇందుకోసం ‘బారో ఎ కప్‌’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. షాప్‌కి వచ్చినవాళ్లు సొంతంగా కప్‌ని తెచ్చుకోవచ్చు. అది వీలుకానప్పుడు వాళ్లే ఓ స్టీల్‌ కప్పుని అద్దెకిస్తారు. వాడుకుని మళ్లీ అక్కడ పెట్టేయొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని