పదును పెట్టేస్తుంది!

వంటింట్లో పని చకచకా అవ్వాలంటే కత్తి పదునుగా ఉండాలి. కత్తులకు పదును పెట్టేందుకు మార్కెట్లో వివిధ రకాల పరికరాలు దొరుకుతున్నా వీటిల్లో జపనీస్‌ వాటర్‌ స్టోన్‌ ప్రత్యేకమైంది. చూడ్డానికివి దీర్ఘ చతురస్రాకారంలో లోహపు దిమ్మలా ఉంటాయి.

Published : 02 Oct 2022 00:03 IST

వంటింట్లో పని చకచకా అవ్వాలంటే కత్తి పదునుగా ఉండాలి. కత్తులకు పదును పెట్టేందుకు మార్కెట్లో వివిధ రకాల పరికరాలు దొరుకుతున్నా వీటిల్లో జపనీస్‌ వాటర్‌ స్టోన్‌ ప్రత్యేకమైంది. చూడ్డానికివి దీర్ఘ చతురస్రాకారంలో లోహపు దిమ్మలా ఉంటాయి. ఈ స్టోన్స్‌ని నీటిలో ఉంచి దానిపై కత్తులను సానపెడతారు. వెంట్రుకవాసి మందంతో కూడా కాయగూరల్ని తరగడానికి ఇవి ఉపకరిస్తాయి. ఈ పదునులో ఇంకా నాణ్యత కావాలనుకొనే వారికి డైమండ్‌స్టోన్‌, వెట్‌స్టోన్‌, ఆయిల్‌స్టోన్‌ వంటివి కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని