రక్షించే టవల్‌

వంటింట్లో పనంటే నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. అందులోనూ పండగలప్పుడు పిండి వంటలు చేస్తుంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నూనె చిమ్మడం.. మంటలు రావడం వంటివి చూస్తూనే ఉంటాం.

Published : 23 Oct 2022 00:38 IST

వంటింట్లో పనంటే నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. అందులోనూ పండగలప్పుడు పిండి వంటలు చేస్తుంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నూనె చిమ్మడం.. మంటలు రావడం వంటివి చూస్తూనే ఉంటాం. ఇలాంటివి జరిగినప్పుడు సాధారణంగా చాలామంది నీళ్లనో, దగ్గర్లో ఉన్న వస్త్రాన్నో తీసుకుని మంటని అదుపు చేయాలని చూస్తుంటారు. ఇవి ఒక్కోసారి ప్రమాద తీవ్రతని పెంచొచ్చు కూడా. అలాంటి ప్రమాదాలు నివారించడానికి ఈ ఫైర్‌ బ్లాంకెట్‌ని కిచెన్‌లో అందుబాటులో ఉంచుకోండి. గోడకి ఏర్పాటు చేసుకోవడానికి అనువుగా ఉండే ఈ కిట్‌లో ఆ సమయంలో ధరించేందుకు వీలుగా చేతి తొడుగులు, మంటలు ఆర్పేందుకు వాడే బ్లాంకెట్‌ ఉంటాయి. ఆ కిట్‌పై రాసి ఉన్న నిబంధనలు అనుసరించి బ్లాంకెట్‌ని ఉపయోగిస్తే ప్రమాదాన్ని నివారించవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని