నొప్పి తగ్గించే గరంమసాలా

గరంమసాలాలో జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, బిర్యానీ ఆకు సహా అనేక సుగంధ ద్రవ్యాలని వాడుతుంటారు. ఈ మసాలాపొడిని మితంగా వాడితే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Published : 23 Oct 2022 00:40 IST

కొంతమంది అన్నికూరల్లోనూ గరంమసాలా వేస్తారు. రుచిగా ఉంటుందని. మరికొందరు మసాలా అంటేనే భయపడతారు. ఆరోగ్యానికి హానిచేస్తుందేమోనని. ఇందులో ఏది నిజం?

గరంమసాలాలో జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, బిర్యానీ ఆకు సహా అనేక సుగంధ ద్రవ్యాలని వాడుతుంటారు. ఈ మసాలాపొడిని మితంగా వాడితే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
* గరంమసాలా పదార్థాలకు రుచిని జోడించి.. తినాలనే కోరికని పెంచుతుంది. అలాగే తిన్న తర్వాత వంటకాలు సులభంగా జీర్ణమవ్వడానికి సహకరిస్తుంది. దీనిలోని ఫైటోన్యూట్రియంట్లు జీవక్రియలు సజావుగా సాగడానికి సహకరిస్తాయి. ముఖ్యంగా ఖనిజాలు ఎక్కువగా ఉండే మసాలా అవయవాలు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది. కడుపులో వికారాన్ని తగ్గించి చర్మాన్ని కాంతిమంతంగా చేస్తుందంటున్నారు డాక్టర్‌ రూపాలిదత్తా.
* గరంమసాలాలోని లవంగాలు, యాలకులు నోటి దుర్వాసనని అరికడతాయి.
* నెలసరికి ముందు ఎదురయ్యే నొప్పి, వికారం వంటివాటిని కూడా ఈ గరంమసాలా అదుపులో ఉంచుతుంది.
* కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కలిగించి, బరువు తగ్గిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు