చురుకు పుట్టిస్తాయ్‌

ఈ  కాలమంతా పిల్లల ముక్కుకారు తూనే ఉంటుంది. అది తగ్గడానికి టానిక్‌లు, సిరప్‌లు వేస్తుంటాం. బదులుగా... పాలల్లో ఓ చిటికెడు పసుపు వేస్తూ ఉండండి.

Published : 30 Oct 2022 00:16 IST

ఈ కాలంలో మనలో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందుకే మామూలు రోజులతో పోలిస్తే పిల్లలు, పెద్దలు వ్యాధుల బారిన పడుతుంటారు. జీవక్రియల వేగం పెంచి, చలి చిక్కులకు చెక్‌పెట్టే ఆహారాలే ఇవన్నీ...

  కాలమంతా పిల్లల ముక్కుకారు తూనే ఉంటుంది. అది తగ్గడానికి టానిక్‌లు, సిరప్‌లు వేస్తుంటాం. బదులుగా... పాలల్లో ఓ చిటికెడు పసుపు వేస్తూ ఉండండి. జలుబు రాకుండా ఉంటుంది.


జ్జలు.. ఏడాది పొడవునా దొరికినా.. ఇవి తినడానికి సరైన సమయం శీతకాలమే. వీటితో చేసిన రొట్టెలు పిల్లల్లో నిరోధక శక్తిని పెంచి, జలుబు జ్వరాల బారినపడకుండా చేస్తాయి.


చిలగడదుంపల్ని ఉడికించి, కాస్త చాట్‌మసాలా వేసి పెట్టండి. పిల్లలు ఇష్టంగా తింటారు. వీటిలోని కార్బోహైడ్రేËట్లు పిల్లలు హుషారుగా ఉండేందుకు సహకరిస్తాయి.


బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్‌.. ఇవన్నీ పిల్లలకు అత్యవసరమైన ప్రొటీన్‌ని అందిస్తాయి. జీవక్రియలని మెరుగు పరిచి వాళ్ల ఎదుగుదలకి తోడ్పడతాయి.


పాలకూర, మెంతికూర, పుదీనా, కొత్తిమీర... ఇవన్నీ ఈకాలంలో మేలు చేస్తాయి. పాలక్‌పనీర్‌, పుదీనారైస్‌.. ఇలా ఏదోక రూపంలో వారంలో ఒక్కసారైనా ఆకుకూరల సుగుణాలు అందేలా జాగ్రత్త పడండి.


పిల్లలకు చేసే వంటకాల్లో పంచదారకి బదులు బెల్లాన్ని వాడి చూడండి. ఇది దగ్గుకి మంచి మందు. అల్లం, బెల్లం కలిపి చేసే మురబ్బాలు కూడా దగ్గుని తగ్గిస్తాయి.


రోజుకో గుడ్డు.. ఆమ్లెట్‌ రూపంలో అయినా ఫర్వాలేదు. పెప్పర్‌ వేసి అందిస్తే మరీ మంచిది. శీతకాలం వేధించే అనేక సమస్యల నుంచి పిల్లలని కాపాడుతుందీ పోషకాల గుడ్డు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు