ఇక్కడా సర్దేయొచ్చు..

చిన్న ఇంట్లోనే అన్నీ పొందిగ్గా సర్దుకోవాలి. లేదంటే ఇంటి నిండా సామాన్లు కనిపిస్తూ ఇల్లు ఇరుగ్గా అనిపిస్తుంది.

Published : 30 Oct 2022 00:15 IST

చిన్న ఇంట్లోనే అన్నీ పొందిగ్గా సర్దుకోవాలి. లేదంటే ఇంటి నిండా సామాన్లు కనిపిస్తూ ఇల్లు ఇరుగ్గా అనిపిస్తుంది. మీరూ స్థలం లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ ఫ్రిజ్‌ స్టాండులవైపు ఓ లుక్కేయండి. వీటిని ఫ్రిజ్‌కి ఒక పక్కగా అమర్చుకోవచ్చు. వంటింట్లో తరచూ అవసరమయ్యే కత్తెరలు, టిష్యూ పేపర్లు, డస్ట్‌బిన్‌ కవర్లు వంటివి చిందరవందరగా పడెయ్యకుండా ఇక్కడ చక్కగా సర్దేసుకోవచ్చు. స్థలం ఆదా.. సమయానికి ఇవి దొరకవే అని విసుక్కోవాల్సిన పని కూడా లేదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని