Published : 06 Nov 2022 00:42 IST

ఈ చేపని బిందెలతో అమ్ముతారు!

చెబితేకానీ అర్థం కావు... అవి చేపలని. అంత చిన్నగా దారప్పోగుల్లా ఉంటాయి. పులస తర్వాత గోదారోళ్లు ఇష్టపడే ఖరీదైన చేప చీరమీను. వీటిని సోలలు, తవ్వలు, కుంచాలు, సేర్ల లెక్కన అమ్ముతారు. ఈ మధ్య బిందెల్లో ఉంచి విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. ఒక బిందె ధర ముప్ఫైవేలే..

చూడ్డానికి చిన్నగా సేమియాల్లా ఉంటే ఈ చేపలు ఏడాదిలో మూడు వారాలు మాత్రమే దొరుకుతాయి. దసరా నుంచి మొదలై నాగుల చవితి వరకూ ఉంటాయి. వీటిని వలలతో పట్టలేరు. చీరలతో ఒడుపుగా పడుతుంటారు. అందుకే దీన్ని చీరమీను అంటారు. సముద్రనీరు, గోదావరి కలిసే బురద నీటి మడుగుల్లో మాత్రమే దొరుకుతాయి. ఎక్కువగా గోదావరి ప్రాంతాలైన ఫ్రెంచ్‌ యానం, బైరవపాలెం, గుత్తిందీవి, వేమవరం, అంతర్వేది ప్రాంతాల్లో దొరుకుతాయి. చీరమీనుని ఇగురుగాగానీ, చింత చిగురుతోకానీ, మామిడికాయతోకానీ తింటే బాగుంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు