Published : 06 Nov 2022 00:47 IST

బ్రౌన్‌రైస్‌ని ఎలా వండాలి?

బరువు తగ్గడం కోసమని ఓ వారం రోజుల నుంచీ బ్రౌన్‌ రైస్‌ తింటున్నా? చాలా కష్టంగా అనిపిస్తోంది. గట్టిగా ఉంటోంది. ఈ అన్నాన్ని రుచిగా వండుకోగలమా?

- బంగారం, రాజమండ్రి  

బ్రౌన్‌రైస్‌లో నాలుగు రకాలు ఉంటాయి. లేతగోధుమ రంగులో ఉండేవి ఒకరకం. తక్కినవి... చిన్నరకం, మధ్యస్థంగా ఉండేవి, పొడవుగా ఉండేవి. వీటిల్లో బాస్మతీలా పొడవుగా ఉండే రకం రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా మంచివి. అయితే ఈ బియ్యం వండేటప్పుడు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కడిగిన తర్వాత బియ్యాన్ని ఎక్కువ నీళ్లలో కనీసం మూడు నుంచి ఐదుగంటలపాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల ఉడకడానికి తక్కువ సమయం పడుతుంది. అన్నింటికి మించి ఈ బియ్యంలో యాంటీ నూట్రియంట్‌ లేదా ఫైటేట్‌ అనేది ఉంటుంది. దీనినే ఫైటిక్‌ యాసిడ్‌ అని కూడా అంటారు. ఇది ఆరోగ్యానికి మంచిదే అయినా అరగడానికి చాలా సమయం పడుతుంది. ఈ క్రమంలో మన శరీరం ఇనుము, క్యాల్షియం, జింక్‌ వంటివి గ్రహించే పనిని చురుగ్గా చేయలేదు. అదే ఇలా నానబెట్టి తినడం వల్ల ఆ యాంటీన్యూట్రియంట్లు తగ్గి తేలిగ్గా జీర్ణమవుతాయి. మనకి పోషకాహారలేమి రాకుండా ఉంటుంది. సన్నమంట మీద ఉడికిస్తే ముద్దగా కాకుండా పొడిపొడిగా కూడా వస్తుంది. అదే బియ్యాన్ని నానబెట్టకపోతే కుక్కర్‌లో ఉడికించుకోవాలి. వార్చుకోవాలంటే ఒక కప్పు బియ్యానికి ఎనిమిది కప్పుల నీళ్లు పోసుకోవాలి. నీళ్లలో కాస్త ఉప్పు కలుపుకొంటే అన్నం రుచిగా ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు