పొగలుకక్కే... సిజ్‌లర్స్‌!

వేడివేడిగా పొగలు కక్కేలా తినడమంటే చాలామందికి ఇష్టం. కానీ ఈ శీతకాలం అది అయ్యేపనేనా? పొయ్యిమీదవి పొయ్యిమీదే చల్లారిపోతుంటే ఇక పొగలు కక్కడం ఎలా అనుకుంటున్నారా?

Published : 04 Dec 2022 00:31 IST

వేడివేడిగా పొగలు కక్కేలా తినడమంటే చాలామందికి ఇష్టం. కానీ ఈ శీతకాలం అది అయ్యేపనేనా? పొయ్యిమీదవి పొయ్యిమీదే చల్లారిపోతుంటే ఇక పొగలు కక్కడం ఎలా అనుకుంటున్నారా? అయితే మీలాంటి వాళ్లకోసమే బజారులో సిజ్‌లర్స్‌ వంటకాలు, పాత్రలు దొరుకుతున్నాయి.. సిజ్‌లర్స్‌.. అంటే ప్రత్యేకమైన పద్ధతిలో వండే వంటకాలు. చెక్కతో చేసిన వెడల్పాటి పాత్రలో ఇనుప పళ్లెం ఉంటుంది. ఈ ఇనుప ప్లేట్‌ని గ్రిల్‌పై బాగా కాల్చి దానిపై గ్రిల్‌ చేసిన కబాబ్స్‌, కాయగూరలు, చికెన్‌ వంటివి వడ్డిస్తారు. ఆపై సూప్‌ లేదా సాస్‌ వెయ్యగానే ‘సుయ్య్‌’ మని శబ్ధం వస్తూ పదార్థాలు పొగలు కక్కుతూ నోరూరిస్తుంటాయి. ఇవే సిజ్‌లర్స్‌. మొదట్లో ఇది జపాన్‌, అమెరికా సంస్కృతి. 70ల్లో అక్కడ నుంచి వచ్చి ముంబయిలో స్థిరపడిన ఫిరోజ్‌ ఇరానీ అనే ఆయన మొదటిసారి ఈ సిజ్‌లర్స్‌ హోటళ్లకి శ్రీకారం చుట్టాడు. తర్వాత వాళ్ల అబ్బాయి షారుఖ్‌ఇరానీ వాటిని విస్తరింపచేశాడు. ఇప్పుడు దాదాపుగా అన్ని నగరాల్లోనూ ఈ సిజ్‌లర్స్‌ దొరుకుతున్నాయి. వీటిని ఇంట్లో కూడా చేసుకుందాం అనుకొనేవారికి.. సిజ్‌లర్స్‌ పాత్రలు ఆన్‌లైన్‌లోనూ దొరుకుతున్నాయి. తేలిగ్గానే ప్రయ త్నించొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని