రుచిగా గ్రేవీ చేయడం ఎలా?
హోటల్లో చేసే కూరల్లోని గ్రేవీలు భలే రుచిగా ఉంటాయి. చాలాసార్లు చికెన్ కూరలో ముక్కలకన్నా గ్రేవీనే ఇష్టంగా తింటా. అలా ఇంట్లో చేస్తుంటే రావడం లేదు. గ్రేవీ రుచిగా ఉండేందుకు ఏవైనా టిప్స్ చెప్పరా?
- జ్యోతి, హైదరాబాద్
ఇంట్లో కూడా హోటల్ రుచితో గ్రేవీని తయారుచేసుకోవచ్చు. ఇందుకోసం కొన్ని చిట్కాలు ఉంటాయి. మసాలాలు వేయించేటప్పుడు చాలామంది పెద్దమంటలో పెట్టి వేయిస్తారు. అలా చేస్తే కూర చేదొస్తుంది. దగ్గరుండి చిన్నమంట మీద రోస్ట్ చేసుకోవాలి. అలాగే గ్రేవీ తయారీలో నూనె కన్నా... వెన్న, నెయ్యి కూడా వాడి చూడండి. ఒకరకం భిన్నమైన రుచి వస్తుంది. అలాగే కాస్త మామూలు పంచదార కానీ, కారామిలైజ్డ్ పంచదారని కానీ వాడండి. టొమాటోలు దొరకని కాలంలో కెచప్‌ని వాడుకోవచ్చు. కృత్రిమ రంగులని వాడాల్సిన అవసరం లేదు. పండిన టొమాటోలని వాడటం మంచిది. మంచి నాణ్యమైన ఎండు మిరపకాయల్ని ఎండలో పెట్టి కారం ఆడించి దాన్ని కూరల్లో వాడండి. రుచి చాలా బాగుంటుంది. ప్యాకెట్లో దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా... ఇంట్లో 60శాతం వెల్లుల్లి, 40 అల్లం వాడి చేసిన తాజా పేస్ట్‌ని వాడండి. కోరుకున్నట్టుగా గ్రేవీ వస్తుంది. ఎక్కడైనా పాలు వాడాల్సి వస్తే చిక్కని కొబ్బరి పాలు ప్రత్యామ్నాయంగా వాడండి. గ్రేవీ కోసం వాడే పదార్థాల్లో గసగసాలనికానీ, జీడిపప్పుకానీ జోడిస్తే మంచి రుచితోపాటు చక్కని టెక్స్చర్ వస్తుంది. గసగసాలని వాడుతున్నట్టైతే కాసేపు నానబెట్టి అప్పుడు రుబ్బుకోవాలి. పసుపు, మిరియాలపొడి వంటి వాటిని నూనె లేదా నెయ్యిలో నేరుగా కలపాలి. నూనె, నెయ్యి, బటర్ ఏదైనా సరే... తక్కువ వేస్తే బాగోవు. అలాగని ఎక్కువ వేస్తే వెగటుగా ఉంటాయి. తగినంత మొత్తంలోనే వేసుకోవాలి.
శ్రీదేవి, హోటల్ మేనేజిమెంట్ నిపుణురాలు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Musharraf: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత
-
Movies News
Bobby: త్వరలోనే మరో మెగా హీరోతో సినిమా..: దర్శకుడు బాబీ
-
Politics News
Aaditya Thackeray: రాజీనామా చేసి నాపై పోటీ చెయ్.. సీఎంకు ఆదిత్య సవాల్!
-
General News
APSLPRB: కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
Sports News
IND vs AUS: ఇయాన్ హీలీ ‘పిచ్’ వ్యాఖ్యలకు జాన్ రైట్ కౌంటర్..
-
Politics News
Kotamreddy: నాకు రఘురామ కంటే పదింతల వేధింపులు ఉంటాయి: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి