కాలుష్యానికి చెక్‌పెట్టే బెల్లం!

శీతకాలంలో బెల్లానికి మించిన దివ్యౌషధం మరొకటి ఉండదేమో! వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండే ఈ కాలంలో బెల్లం వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది

Published : 04 Dec 2022 00:31 IST

శీతకాలంలో బెల్లానికి మించిన దివ్యౌషధం మరొకటి ఉండదేమో! వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండే ఈ కాలంలో బెల్లం వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. శ్వాసకోశ ఇబ్బందులు రాకుండా ఉండేందుకూ ఉపకరిస్తుంది..
* బెల్లం శరీరంలోని వ్యర్థాలను బయటకు నెట్టేస్తుంది. కాలేయంపై భారం పడకుండా చేస్తుంది. అందుకే భోజనం తర్వాత ఒక చిన్నబెల్లం ముక్క తింటే మంచిదనేది.
* జలుబు, దగ్గువంటివి చికాకు పెట్టే రోజులివి. ఆ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే.. టీలో పంచదారకు బదులు బెల్లాన్ని వాడి చూడండి.
*బెల్లానికి రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది. రోజూ ఓ చిన్నముక్కు తింటే రక్తంలోని దోషాలు తొలగిపోతాయి. బీపీని అదుపులో ఉంచుతుంది.
* దీనిలోని యాంటీఆక్సిడెంట్లు రక్తహీనతను తగ్గించి, ఇన్‌ఫెక్షన్లను దరిచేరకుండా చూస్తాయి. కీళ్లనొప్పులు రాకుండా ఉంటాయి.
* ఫ్యాక్టరీలు, కాలుష్యం ఎక్కువగా ఉండే చోట్ల పనిచేసేవాళ్లు బెల్లాన్ని తింటే ఊపిరితిత్తుల్లో ఉన్న వ్యర్థాలు బయటకు పోయి శరీరానికి మేలు జరుగుతుంది.
* నెలసరి రోజుల్లో తీవ్రమైన కడుపునొప్పితో బాధపడేవారు రోజూ బెల్లం తింటే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని