రంగుల మిరియాలు
పోషకాలం
జలుబు, దగ్గు, జ్వరం వంటివి ఈ కాలంలో సర్వ సాధారణంగా వేధించే సమస్యలు. వాటి బారినపడకుండా చేయడానికి మిరియాలు భలేగా ఉపకరిస్తాయని తెలుసు కదా! అయితే మిరియాలంటే నల్ల మిరియాలు మాత్రమే కాదు వీటిల్లోనూ బోలెడు రకాలుంటాయి. రకాల్నిబట్టి ప్రయోజనాలూ ఉంటాయి. ఏరకం మిరియాలు ఏ ప్రయోజనాలు అందిస్తాయో చూద్దాం...
లాంగ్‌పెప్పర్: చూడ్డానికి పొడవుగా ఉంటాయి. ఇవి మనదేశం, నేపాల్, మలేషియాల్లో ఎక్కువగా పండుతాయి. శ్వాస ఇబ్బందుల్ని తొలగిస్తాయి. కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. నెలసరికి ముందు వీటిని ఆహారంలో చేర్చుకుంటే ఆ చికాకుల నుంచి ఉపశమనం దొరుకుతుంది.
పింక్ మిరియాలు: గులాబీరంగులో ఉండే ఈ మిరియాలని సాస్‌ల తయారీలో వాడతారు. సలాడ్లు, కూరలు పూర్తయ్యాక ఫినిషింగ్ టచ్‌గా వాడే ఈ మిరియాలు వంటకానికి అదనపు అందాన్ని తెస్తాయి. రుచిగానూ ఉంటాయి. ఇవి ఉత్తర అమెరికాలో ఎక్కువగా పండుతాయి.
నల్ల మిరియాలు: మనం ఎక్కువగా వాడేవి ఇవే. దంతాలు ఆరోగ్యంగా ఉండటానికీ, చర్మం నిగారింపుని సంతరించుకోవడానికీ, చురుగ్గా నిర్ణయాలు తీసుకోవడానికీ ఈ నల్ల మిరియాలు సహకరిస్తాయి. మనం తీసుకున్న ఆహారం నుంచి పోషకాలు గ్రహించే శక్తి ఈ మిరియాలకు ఎక్కువగా ఉంటుంది. అందుకే సలాడ్లు, సూపుల్లో మిర్చీకి బదులుగా మిరియాలపొడికి ప్రాధాన్యం ఇచ్చి చూడండి. రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలని పొందొచ్చు.
తెల్ల మిరియాలు: నల్ల మిరియాలపై ఉండే పొట్టు తొలగించి వీటిని తయారు చేస్తారు. వాటితో పోలిస్తే ఘాటుగా ఉంటాయి. ఎక్కువగా సాస్‌ల తయారీలో ఉపయోగిస్తారు. కొన్ని కూరల్లో నల్లగా కనిపించకూడదు అనుకుంటే వీటిని వాడుతుంటారు. రుచికి రుచి.. అవే ఆరోగ్య ప్రయోజనాలు.
పచ్చ మిరియాలు: పిందె దశలో ఉండగా మిరియాలని కోసి, నీడపట్టున ఆరబెట్టి.. డీహైడ్రేట్ చేసి ఈ పచ్చ మిరియాల్ని తయారుచేస్తారు. ఇవి అంత ఘాటుగా ఉండవు కానీ... ప్రత్యేకమైన సువాసనతో ఉంటాయి. కూర్గ్ వంటి ప్రాంతాల్లో వీటితో పచ్చడి పెడుతుంటారు. చాలా రుచిగా ఉంటుంది. కూరల్లో కారానికి బదులుగా వీటిని వాడటం వల్ల కాయగూర ముక్కలు భిన్నమైన రంగుల్లో కనిపిస్తూ చూడ్డానికి బాగుంటాయి.
షెజువాన్ పెప్పర్‌కార్న్: చైనాలో ప్రత్యేకమైన ప్రాంతంలో పండే ఈ మిరియాలకి ఘాటు రుచే కాదు ఘాటు వాసన కూడా ఉంటుంది. సలాడ్లు, సాస్‌లలో వాడతారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
NTR: ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 నాణెం.. త్వరలో మార్కెట్లోకి
-
World News
Nowruz: గూగుల్ డూడుల్ ‘నౌరుజ్ 2023’ గురించి తెలుసా?
-
General News
Amaravati: అమరావతిలో మళ్లీ అలజడి.. ఆర్ 5జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ
-
Sports News
MIW vs RCBW: ముంబయి ఇండియన్స్ చేతిలో ఆర్సీబీ చిత్తు..
-
India News
Amritpal Singh: ‘ఆపరేషన్ అమృత్‌పాల్’కు పక్షం రోజులు ముందే నిశ్శబ్దంగా ఏర్పాట్లు..!
-
Movies News
RRR: ‘ఆస్కార్’కు అందుకే వెళ్లలేదు.. ఆ ఖర్చు గురించి తెలియదు: ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత