దంత ఆరోగ్యానికి.. లవంగం!

లవంగంలేని మాంసాహార వంటకాలని ఊహించలేం కదా! మసాలాల్లో రారాజులాంటి లవంగానికి కేవలం ఘాటు రుచి మాత్రమే కాదు... బోలెడు ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి..

Updated : 01 Jan 2023 06:34 IST

లవంగంలేని మాంసాహార వంటకాలని ఊహించలేం కదా! మసాలాల్లో రారాజులాంటి లవంగానికి కేవలం ఘాటు రుచి మాత్రమే కాదు... బోలెడు ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి..
* పంటి నొప్పి వచ్చినప్పుడు లవంగం నూనె వాడితే ఉపశమనంగా ఉంటుంది. లవంగంలోని నూనెలు.. పంటిపై బ్యాక్టీరియా విస్తరించకుండా చేసి, దంతాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. అందుకే లవంగ సుగుణాలున్న పేస్ట్‌ని వాడితే ప్రయోజనం.
* చురుగ్గా నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన మాంగనీస్‌, పీచు ఈ లవంగాల్లో అధికంగా ఉంటాయి. ఎముకలు బలంగా ఉండాలంటే లవంగాలని మోతాదు మేరకు ఆహారంలో తీసుకుంటే మంచిది.
* లైంగిక జీవితంలో ఎదురయ్యే సమస్యలకు లవంగాలు చక్కని పరిష్కారం. ముఖంపై నల్లని మచ్చలు, యాక్నెవంటివి తొలగిపోవడానికి చక్కని ఆహారం.
* కాసిని నీళ్లలో లవంగాలని వేసి మరిగించి దానికి కొద్దిగా తేనె, పెప్పర్‌మింట్‌ ఆయిల్‌ కలిపితే చక్కని మౌత్‌ ఫ్రెషనర్‌గా మారిపోతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని