పండగ పని తేలికిక!

అదిరసం ప్రెస్సర్‌: అదిరసాలు అంటే అరిసెలు. వీటిని నూనెలో వేయించిన తర్వాత దానిలో నూనెంతా పోయేలా బలంగా ఒత్తాలి కదా! మామూలుగా అయితే రెండు చిల్లుల గరిటెల మధ్యలో ఉంచి ఒత్తుతుంటాం.

Published : 08 Jan 2023 00:34 IST

పండగ వస్తుందంటే గవ్వలు చేయాలి, అరిసెలు వండాలి... కజ్జికాయలు చేయాలి కదా! పూర్వం అంటే పెద్ద కుటుంబాలు. తలోచేయి వస్తే చకచకా వంటలు అయిపోయేవి. మరిప్పుడు అన్నీ చిన్న కుటుంబాలు కదా! అందుకే ఆన్‌లైన్‌లో అవసరమైన పరికరాలు తీసుకోండి. చకచకా వంటకాలు కానిచ్చేయండి.

అదిరసం ప్రెస్సర్‌: అదిరసాలు అంటే అరిసెలు. వీటిని నూనెలో వేయించిన తర్వాత దానిలో నూనెంతా పోయేలా బలంగా ఒత్తాలి కదా! మామూలుగా అయితే రెండు చిల్లుల గరిటెల మధ్యలో ఉంచి ఒత్తుతుంటాం. నూనెంతా బయటకు పోయేలా. అలా చేసేటప్పుడు నూనె మీదికి చిందినా చిందొచ్చు. అలా జరగకుండా ఉండాలంటే.. ఈ ప్రెస్సర్‌ మధ్యలో ఉంచి పైనున్న పిడితో ఒత్తితే చిల్లుల నుంచి నూనెంతా బయటకు పోతుంది. పిల్లలు ఇష్టపడే గవ్వలు, కజ్జికాయలు చేయడానికి చెక్కలు, కజ్జికాయ మేకర్లు, గులాబీ గుత్తులు కూడా ఎక్కువ వెతకాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని