కండ బలానికి..

బరువు పెరగకూడదు. కండ మాత్రం పెరగాలి అనుకుంటున్నారా? అయితే మీరు ఈ మజిల్‌ ఫుడ్‌  గురించి తెలుసుకోవాల్సిందే?

Updated : 22 Jan 2023 02:50 IST

బరువు పెరగకూడదు. కండ మాత్రం పెరగాలి అనుకుంటున్నారా? అయితే మీరు ఈ మజిల్‌ ఫుడ్‌  గురించి తెలుసుకోవాల్సిందే?


అవిసెలు: శరీరం కొవ్వుతో నిండి పోయి ఓ ఆకృతంటూ లేకుండా బరువు పెరిగేవారు తగ్గే క్రమంలో అవిసె గింజలకి ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులని పంచే ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఈ గింజలతో చేసే స్మూతీలు, లడ్డూలు మేలు చేస్తాయి.


బీన్స్‌: శాకాహారులకు బి విటమిన్‌ మొదలుకుని ప్రొటీన్లు, పీచుని అందించి చక్కని కండ బలాన్ని అందించే ఆహారం బీన్స్‌ గింజలు.


చికెన్‌: మసాలాలు వేసి వేపుళ్ల రూపంలో ఉన్న చికెన్‌ని కాకుండా.. మసాలా తగ్గించి సలాడ్‌ పద్ధతిలో తింటే మంచిది. కండబలం పెరుగుతుంది.


పెరుగు: పెరుగే కదా అని తక్కువ అంచనా వేయొద్దు. జీర్ణశక్తి పెరగాలన్నా, బరువు తగ్గాలన్నా, ప్రొటీన్‌ అందాలన్నా పెరుగు తినడమే మేలైన మార్గం.


గుడ్లు: ఆరు గ్రాముల ప్రొటీన్‌తో పాటు వ్యాధినిరోధక శక్తిని పెంచే జింక్‌, క్యాల్షియం, లూటిన్‌, జియాంతిన్‌ వంటివన్నీ పుష్కలంగా అందిస్తుంది గుడ్డు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని