ప్రేమ చెంచాలు ఇచ్చి పుచ్చుకుంటారు..

వేలంటైన్స్‌డే అంటే రోజాలు, చాక్లెట్‌లే గుర్తుకొస్తాయి కానీ... ఈ ప్రేమికుల దినోత్సవాన్ని ఒక్కో దేశంలో ఒక్కోలా జరుపుకొంటారిలా..

Published : 12 Feb 2023 00:40 IST

వేలంటైన్స్‌డే అంటే రోజాలు, చాక్లెట్‌లే గుర్తుకొస్తాయి కానీ... ఈ ప్రేమికుల దినోత్సవాన్ని ఒక్కో దేశంలో ఒక్కోలా జరుపుకొంటారిలా..

* జపాన్‌లో అమ్మాయిలు అబ్బాయిలకు చాక్లెట్‌లు ఇస్తారు. అవి ఇచ్చీఇవ్వగానే వాళ్ల ముఖాల్లో  కనిపించే భావోద్వేగాలని బట్టి వాళ్ల ప్రేమ జీవితం ఆ ఏడాదంతా ఉంటుందని నమ్ముతారు.

* దక్షిణ కొరియాలో అమ్మాయిలు ప్రేమికుల దినోత్సవానికి సరిగా నెల తర్వాత ప్రేమకు అంగీకారం రాకపోతే నల్ల నూడుల్స్‌ తింటూ.. సింగిల్‌ జీవితమే సో బెటరు అని వేడుక చేసుకుంటారట.

* వేల్స్‌లో ప్రేమికులు ఒకరికొకరు ప్రేమ చెంచాలు ఇచ్చి పుచ్చుకుంటారు.

* కుర్దిష్‌ ఇరాక్‌లో ‘ప్రేమ విందు’.. ఏర్పాటు చేసుకుంటారు. ఆదామ్‌, ఈవ్‌ల గుర్తుగా ఈ విందులో ఆపిల్‌ పండ్లని ప్రధానంగా అలంకరిస్తారు.

* పచ్చసొన లేని గుడ్లని మిరియాల పొడి చల్లి తింటే ఆ రాత్రి కలల రాకుమారుడు కనిపిస్తాడని ఎదురు చూస్తుంటారట బ్రిటన్‌ అమ్మాయిలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని