గరిటె కింద పెట్టకుండా...

వంట చేసేటప్పుడు.. గరిటెను మధ్యలో కింద పెట్టాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఆ గరిటెకు అక్కడి పదార్థాలు, చెత్తా చెదారం అంటుకోవచ్చు. తిరిగి దానిని కూరలో పెట్టలేం.

Published : 19 Feb 2023 00:11 IST

వంట చేసేటప్పుడు.. గరిటెను మధ్యలో కింద పెట్టాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఆ గరిటెకు అక్కడి పదార్థాలు, చెత్తా చెదారం అంటుకోవచ్చు. తిరిగి దానిని కూరలో పెట్టలేం. మళ్లీ కడిగి వాడుకోవాలి. అలాంటి అవసరం లేకుండా వండే గిన్నెపై పెట్టుకొనే సదుపాయం ఉంటే? ఎందుకు లేదు. ఈ స్పూన్‌ హోల్డర్లని పాత్రల అంచులకు బిగించుకోవచ్చు. గరిటెలను కింద పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ హోల్డర్‌లో పెట్టుకోవడమే. సిలికాన్‌తో తయారైన పరికరం కాబట్టి... వేడికి కరుగుతుందన్న భయం లేదు. గరిటెలు పెట్టుకోవడానికే కాదు... ఆవిరిని బయటకు పంపించడానికీ ఇవి ఉపయోగపడతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని