చల్లదనానికి చిరు ధాన్యాలు!

వేసవి వస్తుందంటే శరీరానికి చల్లదనాన్నిచ్చే ఆహారం తినాలని అనుకుంటాం. మనకు తెలిసిన మజ్జిగ, సొరకాయలు వంటివి మాత్రమే కాకుండా చిరుధాన్యాలు కూడా చలువ చేస్తాయి.

Updated : 19 Feb 2023 03:34 IST

వేసవి వస్తుందంటే శరీరానికి చల్లదనాన్నిచ్చే ఆహారం తినాలని అనుకుంటాం. మనకు తెలిసిన మజ్జిగ, సొరకాయలు వంటివి మాత్రమే కాకుండా చిరుధాన్యాలు కూడా చలువ చేస్తాయి. ముఖ్యంగా రాగులు, జొన్నలు, కొర్రలు ఈ కాలంలో ఎంతో మేలు చేస్తాయి..

రాగులు: వీటిల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందుకే వీటిని ‘పేదోళ్ల పాలు’గా పిలుస్తారు. రక్తహీనతతో బాధపడేవారు రాగి జావ తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. బెల్లంతో కలిపి తీసుకుంటే ఎక్కువ పోషకాలు అందుతాయి.

జొన్నలు: ఇవి వేసవిలో బాగా చలువచేస్తాయి. బి విటమిన్లు అధికంగా ఉంటాయి. జుట్టు, చర్మానికి మంచిది. వర్కవుట్లు చేయడానికి ముందు తాగితే పోషకాలు కోల్పోకుండా చేస్తుంది.

బార్లీ: బార్లీ నీరు తాగుతూ ఉంటే శరీరానికి తగిన పోషకాలు అంది మూత్ర సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. కడుపు ఉబ్బరం తగ్గుతుంది. రాత్రి బార్లీ గింజలు నానబెట్టి.. తెల్లారి ఆ నీళ్లు తాగితే మంచిది. మొలకలు వచ్చిన బార్లీ గింజల పొడిని చపాతీల్లో కలిపినా చక్కని ప్రయోజనాలు అందుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని