దిగులా... ఇవి తినండి!

ఇంటిల్లిపాది ఆరోగ్యం గురించి ఆలోచించే ఆడవాళ్లు తమ గురించి పట్టించుకోరు. నెలసరులు, కుటుంబ భారం ఇలా ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ తరచూ మూడాఫ్‌ అవుతుంటారు.

Published : 05 Mar 2023 00:28 IST

ఇంటిల్లిపాది ఆరోగ్యం గురించి ఆలోచించే ఆడవాళ్లు తమ గురించి పట్టించుకోరు. నెలసరులు, కుటుంబ భారం ఇలా ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ తరచూ మూడాఫ్‌ అవుతుంటారు. అలాంటప్పుడు ఉత్సాహపరుచుకోవడానికి సహకరించే ఆహారం ఇది..

గింజలు: వీటిల్లో అమైనోయాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి సంతోషానికి కారణమయ్యే డోపమైన్‌  విడుదల అయ్యేందుకు సహకరిస్తాయి. వంటింట్లో బాదం, గుమ్మడి, నువ్వుల్ని ఎప్పుడు అందుబాటులో ఉంచుకోండి. మనసుకు చికాకు అనిపించినప్పుడల్లా కాసిని నోట్లో వేసుకోండి. మూడ్‌ మారుతుంది.

డార్క్‌ చాక్లెట్‌: దీనిలోని ఫినైల్‌ థైలమిన్‌ అనే రసాయనం డోపమైన్‌ విడుదలకి కారణం అవుతుంది. అందుకే చాక్లెట్‌ తింటే సంతోషం కలుగుతుంది.

అరటిపండు: దీనిలో విటమిన్‌ బి6 ఉంటుంది. ఇది డోపమైన్‌ని విడుదల చేసి మానసిక స్థితిని నియంత్రణలో ఉంచి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మూడ్‌ బాగోలేనప్పుడు ఒక అరటిపండు తింటే సరి.

బెర్రీలు: వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లెవనాయిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కుంగుబాటు, ఆందోళనని ఆమడ దూరంలో ఉంచుతాయి. జోష్‌ కావాలనుకున్నప్పుడు కాసిని ఎండిన నేరేడు పండ్లని ప్రయత్నిస్తే సరి. అవకాడో కూడా ఇలాంటి సుగుణాలనే కలిగి ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు