థాయ్ పొంగనాలు.. తీపి గుడ్లు!
ఇక్కడ పొంగనాలేంటి అనుకుంటున్నారా? నిజమేనండీ బియ్యప్పిండీ, కొబ్బరిపాలు, కొద్దిగా తీపి వేసి మనం చేసే గుంట పొంగనాల్లా ఉండే ఈ వంటకాన్ని కనోమ్ క్రాక్ అంటారు.
మిగల మగ్గిన మామిడిపండుని పెరుగన్నంతో కలిపి తినడం తెలుసు. కానీ అన్నంలో ఎప్పుడైనా మామిడిపండుని కలుపుకొని తిన్నారా? థాయ్‌లాండ్ వెళ్తే మీకు ముందుగా స్వాగతం పలికేది ఈ మామిడిపండు అన్నమే! ఇదే కాదు మరెన్నో ఆసక్తి గొలిపే వంటకాలూ ఈ ప్రాంతంలో దొరుకుతాయి..
థాయ్ పొంగనాలు: ఇక్కడ పొంగనాలేంటి అనుకుంటున్నారా? నిజమేనండీ బియ్యప్పిండీ, కొబ్బరిపాలు, కొద్దిగా తీపి వేసి మనం చేసే గుంట పొంగనాల్లా ఉండే ఈ వంటకాన్ని కనోమ్ క్రాక్ అంటారు. అయితే వీటి మధ్యలో కొత్తిమీర, పాండా ఆకులు ఉంటాయి.
మ్యాంగో స్టికీరైస్: తీయని మామిడి పండ్లకి, జిగురుగా ఉండే బియ్యానికి థాయ్‌లాండ్ ప్రాచుర్యం పొందింది. వీటిని కలిపి వండే మ్యాంగో స్టికీరైస్‌ని రుచి పరమాద్భుతంగా ఉంటుందట. అందుకే పర్యటకులు ఈ రుచికి ఫిదా అయిపోతుంటారు. స్థానికంగా ఈ వంటకాన్ని కావో మివావో మా మువాంగ్ అంటారు. కొబ్బరిపాలు, మామిడిపండ్లు, జిగురుబియ్యం, పెసరపప్పు కలిపి చేసే వంటకం చూడ్డానికే కాదు రుచిలోనూ భేషుగ్గా ఉంటుంది. థాయిలాండ్‌లో ఏ మూలకెళ్లినా ఈ స్టిక్కీ రైస్ దొరుకుతుంది. బ్యాంకాక్ అన్నింటికన్నా బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి.
తీయని గుడ్లు: థాయిలాండ్‌లో ఎక్కడకు వెళ్లినా నారింజ రంగు మిఠాయిలు కనిపిస్తాయి. వీటిని బాతు గుడ్లతో చేస్తారు. చూడ్డానికే కాదు తినడానికీ బాగుంటాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Kim Jong Un: కిమ్ బరువు 140 కిలోలు.. తీవ్ర నిద్రలేమితో అవస్థలు..!
-
Movies News
Chinmayi: పెళ్లంటూ చేసుకుంటే చిన్మయినే చేసుకోవాలని అప్పుడే అనుకున్నా: రాహుల్ రవీంద్రన్
-
India News
కన్నూరులో నిలిచి ఉన్న ఎక్స్ప్రెస్ రైలు బోగీలో మంటలు
-
General News
Top 10 News @ 9AM: ఈనాడు.నెట్ టాప్ 10 న్యూస్ @ 9AM
-
Crime News
Tirupati: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు.. ముగ్గురు తెలంగాణ వాసుల మృతి
-
Ts-top-news News
Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణపతి 61 అడుగులు