స్టీల్‌ సబ్బు!

ఉల్లిపాయలు కోసినా, చేపలకి మసాలా పట్టించినా, వెల్లుల్లి దంచినా ఆ వాసన మన చేతుల నుంచి ఓ పట్టాన పోదు.

Published : 02 Apr 2023 00:17 IST

ల్లిపాయలు కోసినా, చేపలకి మసాలా పట్టించినా, వెల్లుల్లి దంచినా ఆ వాసన మన చేతుల నుంచి ఓ పట్టాన పోదు. ఆ నీచు వాసన పోగొట్టుకోవడానికి సాధారణ సబ్బుతో రుద్దుతాం. ఆ వాసన తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. మరి దీనికి పరిష్కారం లేదా అంటే? ఎందుకు లేదు స్టీల్‌ సోప్‌ ఉందిగా. ఈ సబ్బుని ప్రత్యేకమైన స్టెయిన్‌లెస్‌స్టీల్‌తో తయారుచేసింది. ఈ సబ్బుతో చేతుల్ని రుద్దినప్పుడు.. ఉల్లిపాయ, వెల్లుల్లి వంటివాటిలో ఉండే ఘాటైన సల్ఫర్‌ మూలకాలని గ్రహించి మన చేతులు దుర్వాసనలు రాకుండా అడ్డుకుంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని