అజ్వా తిన్నారా?

తీయని ఖర్జూరాలంటే ఇష్టపడనిదెవ్వరు? అయితే ఖర్జూరాల్లో చాలా రకాలు ఉంటాయి. వాటిల్లో అజ్వా రకం చాలా ప్రత్యేకం. అరుదుగా దొరికే ఈ పండు పోషకాలపరంగానూ ప్రత్యేకమే...

Published : 16 Apr 2023 00:08 IST

తీయని ఖర్జూరాలంటే ఇష్టపడనిదెవ్వరు? అయితే ఖర్జూరాల్లో చాలా రకాలు ఉంటాయి. వాటిల్లో అజ్వా రకం చాలా ప్రత్యేకం. అరుదుగా దొరికే ఈ పండు పోషకాలపరంగానూ ప్రత్యేకమే...

అజ్వా ఖర్జూరాలు సౌదీ అరేబియాలోని మదీనాలో మాత్రమే పండుతాయి. స్వయంగా భగవంతుడే ఈ చెట్లని నాటాడని స్థానికులు నమ్ముతారు. తేనెలో ముంచినట్టు తీయగా ఉండే పండ్లు పోషకాలకు పెట్టింది పేరు. అధిక మొత్తంలో పీచుని అందిస్తూ రక్తహీనతని నివారిస్తాయీ పండ్లు.

మహిళల్లో సంతాన సాఫల్యతని పెంచడంతోపాటు... అందమైన చర్మాన్ని అందిస్తాయి. చర్మవ్యాధుల నుంచి ఉపశమనం పొందొచ్చు.

ఆందోళన దూరం చేసి.. మనసుని ప్రశాంతంగా ఉంచుతాయి. కడుపులో నులిపురుగులని దూరం చేస్తాయి. పీచు పుష్కలంగా ఉండటం వల్ల మలబద్ధకం రాకుండా చేస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని