అతిగా ఉడికిస్తున్నారా?

కొంతమంది చేస్తే చికెన్‌ భలే రుచిగా ఉంటుంది. నేను అన్ని దినుసులూ వేస్తున్నా రుచి రావడం లేదు.

Updated : 14 May 2023 00:35 IST

కొంతమంది చేస్తే చికెన్‌ భలే రుచిగా ఉంటుంది. నేను అన్ని దినుసులూ వేస్తున్నా రుచి రావడం లేదు. రుచికోసం ఏవైనా చిట్కాలు ఉంటే చెప్పండి?

చికెన్‌ని వేగంగా వండాలి అనుకుంటే ఆ రుచి రాదు. దీన్ని దినుసులతో మారినేట్‌ చేసిన తర్వాత ఎంత సేపు ఉంచితే అంత రుచిగా ఉంటుంది. లేత చికెన్‌ని ఎంచుకుని.. అల్లం వెల్లుల్లి పేస్ట్‌, ఉప్పు, నూనె, పెరుగు లేదా నిమ్మరసం కలిపి 2 గంటల పాటు ఉంచాలి. ఇంకా మృదువుగా రావాలనుకుంటే రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచొచ్చు. అంత సమయం లేదంటే కనీసం అరగంటైనా ఉంచాలి. ఇక ఉల్లిపాయల్ని గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి. ముందే చికెన్‌ వేస్తే తీయగా ఉంటుంది. అలాగే చిక్కటి గ్రేవీ కావాలనుకుంటే వేయించిన వాటిని మిక్సీ పట్టండి. తక్కువ మంట మీద ఉడకనివ్వాలి. టొమాటోలు వేస్తే కొంతమందికి నచ్చదు. అలాంటప్పుడు టొమాటోలని ప్యూరీ చేసి వేస్తే కూరకి మంచి రుచి వస్తుంది. స్టౌ కట్టేయడానికి ఐదు నిమిషాల ముందు మసాలా పొడులు వేసుకోవాలి. చక్కని సువాసన వస్తుంది. అలాగే చికెన్‌ని ఎక్కువ సేపు ఉడికించకూడదు.

పవన్‌ సిరిగిరి, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు