బోలెడు లాభాలు..

పొయ్యిమీద అన్నం ఉడుకుతోంది. మూత తీయడానికి సమయానికి హోల్డర్‌ కానీ, బట్ట కానీ లేదు. గాజు సీసా మూత బిగుసుకుపోయింది. ప్రయత్నిస్తుంటే చేతికి జారిపోతుంది.

Published : 21 May 2023 00:21 IST

పొయ్యిమీద అన్నం ఉడుకుతోంది. మూత తీయడానికి సమయానికి హోల్డర్‌ కానీ, బట్ట కానీ లేదు. గాజు సీసా మూత బిగుసుకుపోయింది. ప్రయత్నిస్తుంటే చేతికి జారిపోతుంది. వెల్లుల్లిపై పొట్టు తీయాలి. వీటన్నింటికి వేర్వేరు పరికరాలకోసం వెతక్కండి. సిలికాన్‌ ట్రైవెట్స్‌ సెట్‌ ఒకటి ఇంట్లో ఉంటే చాలు. ఇవి వంటింట్లో ఎన్నో రకాలుగా ఉపయోగపడాయి. వీటిపై ఉండే డిజైన్‌ తేనెటీగలు పెట్టే హనీకాంబ్‌లా ప్రత్యేకంగా ఉంటుంది. దీంతో వేడిపాత్రల్ని పట్టుకోవచ్చు. ఇవి వేడికి కరగవు. మూతలు తీయడానికి అనుకూలంగా ఉంటాయి. వెల్లుల్లి పొట్టుని వీటితో నలిపి తీయడం తేలిక. వేర్వేరు రంగుల్లో దొరుకుతాయి కాబట్టి డైనింగ్‌ టేబుల్‌పైన టీకప్పులు పెట్టుకొనే కోస్టర్లుగా కూడా పనికొస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని