కాస్త నెయ్యి వేసుకోండి..!

ఎందుకో తెలీదు కానీ.. నెయ్యి మీద చాలా చెడు ప్రచారాలున్నాయి. ముఖ్యంగా కొవ్వు పేరుకుపోతుంది, గుండెజబ్బులొస్తాయి అంటారు. నిజానికి నెయ్యి పదార్థాల రుచి పెంచుతుంది, బలాన్నిస్తుంది, ఆరోగ్యాన్నీ కాపాడుతుంది.

Published : 17 Sep 2023 00:40 IST

ఎందుకో తెలీదు కానీ.. నెయ్యి మీద చాలా చెడు ప్రచారాలున్నాయి. ముఖ్యంగా కొవ్వు పేరుకుపోతుంది, గుండెజబ్బులొస్తాయి అంటారు. నిజానికి నెయ్యి పదార్థాల రుచి పెంచుతుంది, బలాన్నిస్తుంది, ఆరోగ్యాన్నీ కాపాడుతుంది. నేతితో తయారైన మిఠాయిలు ఎంత అమోఘంగా ఉంటాయో వేరే చెప్పాలా! ఇంతకీ నెయ్యి ఎందుకు శ్రేష్ఠమంటే.. ఇందులో ఒమేగా 3 ఫాటీ యాసిడ్స్‌, పీచు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. అందుకే పాత తరం వాళ్లు భోజనంలో నెయ్యి తప్పకుండా వేసుకునేవారు. అదే వాళ్ల ఆరోగ్య రహస్యం మరి. ఇక లాభాల గురించి చెప్పాలంటే.. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, మృదువుగా ఉంచుతుంది. గాయాలు, పుండ్లు, మంట, దురద, దద్దుర్లు లాంటి ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కళ్ల కింద నల్లటి చారలు తగ్గిపోతాయి. శరీరంలో చేరిన దోషాలు తొలగి, రోగనిరోధక శక్తీ పెరుగుతుంది. అరుగుదల బాగుంటుంది. కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. కంటిచూపు మెరుగవుతుంది. మెదడు, నరాల వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. నెయ్యి శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి కాపాడటమే కాదు, ఆయుర్దాయాన్నీ పెంచుతుంది. అన్నిటినీ మించి కూరలు, పచ్చళ్లు, పొడులకు మరింత రుచిని చేకూర్చి ఇష్టంగా తినేలా చేస్తుంది. కల్తీ లేని నెయ్యి చల్లటి ప్రదేశంలో మూడు నెలల పాటు తాజాగానే ఉంటుంది. ఫ్రిజ్‌లో ఏడాది వరకూ నిలవుంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు