అనుకోని ఆవిష్కరణ

పుల్ల ఐస్‌ని ఎంతో ఇష్టంగా తింటాం కదూ! ఇంతకీ దాన్నెవరు కనిపెట్టారో తెలుసా.. 1905లో పదకొండేళ్ల ఫ్రాంక్‌ ఎపర్సన్‌ ఓ సోడాలో పంచదార వేసి కలిపేందుకు పల్చటి ఉడెన్‌ స్పూన్‌ పెట్టాడు.

Published : 02 Jun 2024 01:09 IST

పుల్ల ఐస్‌ని ఎంతో ఇష్టంగా తింటాం కదూ! ఇంతకీ దాన్నెవరు కనిపెట్టారో తెలుసా.. 1905లో పదకొండేళ్ల ఫ్రాంక్‌ ఎపర్సన్‌ ఓ సోడాలో పంచదార వేసి కలిపేందుకు పల్చటి ఉడెన్‌ స్పూన్‌ పెట్టాడు. ఆటల్లో పడి దాని సంగతి మర్చిపోయాడు. అక్కడి మంచు వాతావరణానికి అది కాస్తా గడ్డకట్టేసింది. దాన్ని తీయబోతే.. కప్పులోంచి చెంచాతో సహా వచ్చేసరికి ఫ్రాంక్‌ ఆశ్చర్యపోయాడు, ఆనందించాడు. అలా అనుకోకుండా పుల్ల ఐస్‌ ఆవిష్కరణ జరిగింది. ఫ్రాంక్‌ దానికి ‘ఎప్సికిల్‌’ అని పేరు పెట్టాడు. తనకెంతో నచ్చడంతో.. రోజూ ఐస్‌ పాప్‌లు చేసి బీచ్‌లో అమ్మేవాడు. ఎందరికో నచ్చడంతో దానికి డిమాండ్‌ పెరిగింది. ఎప్సికిల్‌కు పేటెంట్‌ తీసుకుని వ్యాపారం చేసి, విజయం సాధించాడు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని