దోశ ప్రింటర్‌..!

ప్రింటర్‌లో అవసరమైన కథనాలు కాపీలు తీస్తాం. అది మనందరికీ తెలిసిందే! దోశలు కూడా అలా తీయొచ్చు అంటే దోశ బొమ్మల ప్రింటవుట్‌ కాదండోయ్‌. అసలైన దోశలే. ఇదెక్కడి చోద్యం అనుకుంటున్నారా?! అలాంటి పరికరం నిజంగానే ఉంది మరి.

Published : 02 Jun 2024 01:24 IST

సౌకర్యం

ప్రింటర్‌లో అవసరమైన కథనాలు కాపీలు తీస్తాం. అది మనందరికీ తెలిసిందే! దోశలు కూడా అలా తీయొచ్చు అంటే దోశ బొమ్మల ప్రింటవుట్‌ కాదండోయ్‌. అసలైన దోశలే. ఇదెక్కడి చోద్యం అనుకుంటున్నారా?! అలాంటి పరికరం నిజంగానే ఉంది మరి. ఇందులో పిండిని లోడ్‌ చేస్తే చాలు.. 360 డిగ్రీల ఫుడ్‌ గ్రేడ్‌ కోటెడ్‌ రోలర్‌ లోంచి నిమిషంలో దోశలు డౌన్‌లోడ్‌ అవుతాయి. ఎంత మందంగా కావాలి, ఏమాత్రం వేగాలి మొదలైన కంట్రోల్‌ బటన్‌లు కూడా ఉన్నాయి. దీన్ని కొనుక్కున్నామంటే చెమటలు కక్కుతూ దోశలు వేయాల్సిన పనేలేదు. ఎంచక్కా మీట నొక్కితే చాలు.. కరకరలాడే దోశలు వచ్చేస్తాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని