చేతులు కాలవు, పాత్రలు బెసకవు!

వేడి పాత్రలను దించేందుకు పట్‌కార్‌ ఉపయోగించడం మనకేం కొత్త కాదు. అయితే వాటిని ఎప్పటికప్పుడు అవసరానికి తగ్గట్టు అధునాతనంగా రూపొందిస్తున్నారు.

Published : 30 Jun 2024 00:37 IST

వేడి పాత్రలను దించేందుకు పట్‌కార్‌ ఉపయోగించడం మనకేం కొత్త కాదు. అయితే వాటిని ఎప్పటికప్పుడు అవసరానికి తగ్గట్టు అధునాతనంగా రూపొందిస్తున్నారు. మారిన కాలానికి అనుగుణంగా అంచు లేని స్టీల్‌ పాత్రలు, అవెన్‌లో వేడి చేసేందుకు పింగాణీ పాత్రలు వాడుతున్నాం. పాత రకం పట్‌కార్‌ వీటికి అనుకూలం కాదు. ఎలాంటి పాత్రలనైనా బెసికిపోకుండా, గట్టిగా పట్టుకునేలా డిష్‌ గ్రిప్పర్లు, పాట్‌ హోల్డర్లు వచ్చాయి. వీటితో పాత్రలే కాదు, పింగాణీ ప్లేట్లు కూడా అటూ ఇటూ మార్చడం సులువుగా ఉంటుంది. రెండున్నర కిలోల బరువు వరకూ ఒక చేత్తో పట్టుకునే బౌల్‌ పికర్, డిష్‌ హోల్డర్‌; అంతకంటే బరువుంటే చిన్న క్లిప్పులాగ ఉండే రెండు గ్రిప్పర్లు; అవెన్‌ లేదా ఎలక్ట్రిక్‌ కుక్కర్‌ లోంచి తీయడానికి వేడి తట్టుకునే గ్లోవ్స్‌; ప్లేట్లు, పింగాణీ పాత్రలను పట్టుకునేందుకు కింది నుంచి స్టాండ్‌లా ఉండి తేలిగ్గా పట్టుకునే బౌల్‌ క్యారియర్‌... ఇలా అన్నీ కలిపి సెట్‌లా లభిస్తున్నాయి. వీటితో చేతులకు వేడి సెగ తగలదు, పాత్రలు బెసకవు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని