దూద్‌ పేడా.. ఎంతో సులువుగా!

సాయిబాబాకి నివేదించే నైవేద్యాల్లో ‘దూద్‌ పేడా’ ఒకటి. పిల్లలకి కూడా ఇదంటే మహా ఇష్టం. కానీ బయట అమ్మే పేడా పంచదారతో చేస్తారు.

Published : 07 Jul 2024 00:40 IST

సాయిబాబాకి నివేదించే నైవేద్యాల్లో ‘దూద్‌ పేడా’ ఒకటి. పిల్లలకి కూడా ఇదంటే మహా ఇష్టం. కానీ బయట అమ్మే పేడా పంచదారతో చేస్తారు. అది ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి నేను బెల్లంతో చేస్తాను. అది కూడా చాలా తేలికైన పద్ధతిలో. ఎలా చేయాలంటే.. కప్పు బెల్లంలో కప్పు వేడి పాలు పోసి కాసేపు పక్కనుంచాలి. బెల్లం కరిగిపోయాక.. వడకట్టి.. అందులో రెండు కప్పుల మిల్క్‌ పౌడర్‌ జతచేసి బాగా కలపాలి. దీన్ని సన్న సెగ మీద ఉడికిస్తూ ఒక స్పూన్‌ రోజ్‌ వాటర్, నాలుగు స్పూన్ల నెయ్యి జోడించి కలియ తిప్పుతుండాలి. దగ్గరగా అయ్యాక దించేసి.. చిన్నచిన్న పేడాలు చేసుకోవాలి. అంతే స్వీట్‌షాపుల్లో దొరికే వాటికి ఎంతమాత్రం తీసిపోని మిఠాయి తయారైపోతుంది. ఇంత సులువా అని ఆశ్చర్యపోతున్నారు కదూ.. మీరూ ప్రయత్నించి చూడండి మరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని