రెండువేల రకాల ఇడ్లీలు..

చెన్నైలో ఎమ్‌.ఎనివాయన్‌ ఎక్కడ? అని అడిగితే అతనెవరు అంటారు. అదే.. ఇడ్లీమ్యాన్‌ గురించి తెలుసా అంటే తెలియకేం అంటూ.. నేరుగా మల్లిపూ ఇడ్లీ దుకాణానికి తీసుకెళతారు. రుచీపచీ లేని ఇడ్లీనా అంటూ మొహం మాడ్చుకునే వాళ్లు...

Updated : 20 Sep 2022 16:10 IST

ఇడ్లీ మ్యాన్‌
రెండువేల రకాల ఇడ్లీలు..

చెన్నైలో ఎమ్‌.ఎనివాయన్‌ ఎక్కడ? అని అడిగితే అతనెవరు అంటారు. అదే.. ఇడ్లీమ్యాన్‌ గురించి తెలుసా అంటే తెలియకేం అంటూ.. నేరుగా మల్లిపూ ఇడ్లీ దుకాణానికి తీసుకెళతారు. రుచీపచీ లేని ఇడ్లీనా అంటూ మొహం మాడ్చుకునే వాళ్లు కూడా ఇడ్లీమాన్‌ తయారుచేసే రెండు వేల ఇడ్లీ రకాలని చూస్తే మతి పోగొట్టుకుంటారు. తాజాగా ఇడ్లీ దినోత్సవానికి అతను చేసిన 125 కేజీల బరువున్న ఇడ్లీ గిన్నిస్‌ రికార్డులకి ఎక్కితే... అతను తయారుచేసే విభిన్నమైన ఇడ్లీలను చూసి తమిళ ప్రజలు మనసు పారేసుకుంటున్నారు. కప్‌ ఇడ్లీ, ఆరెంజ్‌ ఇడ్లీ, కొబ్బరిబొండాం ఇడ్లీ ఇలా ఒక్కటేంటి వేల రకాల ఇడ్లీలు తయారుచేయడంలో అతను నిష్ణాతుడు. ఎనిమిదో తరగతి మాత్రమే చదువుకున్న ఎనివాయన్‌ ఆటో నడుపుకొంటూ, హోటల్లో టేబుళ్లు తుడుచుకునే వృత్తిలో ఉండేవాడు. చంద్రమ్మ అనే కష్టజీవి తన ఆటోలో రోజూ ఇడ్లీపిండి, ఇడ్లీలు మోసుకెళ్లడం చూసిన తర్వాత అతనికి ఇలా విభిన్నమైన ఇడ్లీలు తయారుచేయాలనే ఆలోచన వచ్చిందట. అతను తయారుచేసే ఇడ్లీలను పెద్ద పెద్ద హోటళ్లు తమ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఆర్డర్‌ ఇచ్చి తెప్పించుకుంటాయట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని