చినుకులు పడేవేళ...

వర్షాకాలంలో సలాడ్లు, మొలకలు వంటివి తినేటప్పుడు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్నున్నాయి... ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివే. కానీ వర్షాకాలంలో వీటిని తినేటప్పుడు పచ్చిగా తినడం ఎంతమాత్రం సురక్షితం కాదు.

Published : 12 Aug 2018 01:47 IST

పోషకాలమ్‌!
చినుకులు పడేవేళ...

వర్షాకాలంలో సలాడ్లు, మొలకలు వంటివి తినేటప్పుడు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్నున్నాయి...

కుకూరలు ఆరోగ్యానికి మంచివే. కానీ వర్షాకాలంలో వీటిని తినేటప్పుడు పచ్చిగా తినడం ఎంతమాత్రం సురక్షితం కాదు. ఆకులపై బ్యాక్టీరియా, క్రిములు వంటివి నివాసం ఏర్పరుచుకునే సమయం ఇది. ఆకులని శుభ్రం చేసి, పూర్తిగా ఉడికించినవి మాత్రమే తినాలి. మొలకలు ఆరోగ్యానికి మంచివని గబుక్కున కనిపించగానే నోట్లో వేసుకోవద్దు. పచ్చివి జీర్ణ సమస్యలు తలెత్తడానికి కారణం అవుతాయి. తప్పనిసరిగా ఉడికించి తినడమే మేలు. క్యాలిఫ్లవర్‌ వంటి వాటిని ఉప్పునీళ్లలో    కొన్ని నిమిషాల పాటూ ఉంచి అప్పుడు వండాలి. యాపిల్‌,   కీరా వంటి పండ్లని తొక్క తీయకుండా మాత్రం తినొద్దు. అవసరం అయితే వెనిగర్‌లో కాసేపు పళ్లను ఉంచి శుభ్రం చేసిన తర్వాతే తినాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని