పెరట్లోంచి పళ్లెంలోకి...

ఈ మధ్య రెస్టరంట్లు ఎఫ్‌2టి అనే సరికొత్త పాకశాస్త్ర నినాదంతో ముందుకు వెళ్తున్నాయి. ఎఫ్‌2టి అంటే ఫామ్‌టుటేబుల్‌(తోటలోంచి నేరుగా భోజనాల...

Published : 02 Sep 2018 01:45 IST

ట్రెండ్‌గురూ
పెరట్లోంచి పళ్లెంలోకి...

ఈ మధ్య రెస్టరంట్లు ఎఫ్‌2టి అనే సరికొత్త పాకశాస్త్ర నినాదంతో ముందుకు వెళ్తున్నాయి. ఎఫ్‌2టి అంటే ఫామ్‌టుటేబుల్‌(తోటలోంచి నేరుగా భోజనాల బల్లపైకి)అని అర్థం. ఇప్పుడిప్పుడే మనదేశంలోనూ ఊపందుకుంటున్న ఎఫ్‌2టి గురించి వివరాల్లోకి వెళ్తే...

క్కడ పండించారో తెలియదు... ఎలా పండించారో తెలియదు. మనం తినే ఆహారంలో రసాయనాల గురించి ఎవ్వరూ హామీ ఇవ్వలేరు. దిల్లీలోని ప్లక్‌ రెస్టరంట్‌ మాత్రం రసాయనాల లేని ఆహారాన్నే వండి వారుస్తోంది. నమ్మేదెలా అంటారా? రెస్టరంట్‌ వెనుక ఉన్న పెరట్లోకి వెళ్లి చూడండి. రసాయనాలు చల్లని కాయగూరలు తాజాగా మిమ్మల్ని పలకరిస్తాయి. అందులోంచి మీరు కోరిన వాటినే మెనూగా ఎంపిక చేసుకోవచ్చు. ఆ తాజా కాయగూరలు మీ భోజనాలబల్లపైకి మెనూగా వస్తాయి. కాలిఫ్లవర్‌, క్యాబేజీ, కొత్తిమీర, పుదీనా, టమాటా, పాలకూర, ఆవ, ఉల్లి, ఆలూ ఇలా వివిధరకాల కాయగూరల్ని అక్కడ పండిస్తారు. నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవడమే. ఫ్రాన్స్‌లో 14 సంవత్సరాల పాటు చెఫ్‌గా పనిచేసిన అజయ్‌ఆనంద్‌ తాజాతాజా పోషకాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ రెస్టరంట్‌ని ప్రారంభించాడట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని