వహ్వా హల్వా.. తియ్యటి వేడుకకు తయారా!
స్వీట్లెన్ని ఉన్నా... ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయే హల్వా ప్రత్యేకతే వేరు. కొంచెం తినగానే.. మరి కొంచెం కావాలనకుండా ఉండలేరు. నోరూరించే హల్వా రుచితోపాటు శరీరానికి అవసరమైన వేడినీ అందిస్తుంది. మీరూ ప్రయత్నిస్తారా మరి...
గాజర్ హల్వా
కావాల్సినవి: క్యారెట్లు- అరకేజీ, ఫుల్‌ఫ్యాట్ మిల్క్- అర లీటరు, నెయ్యి- టేబుల్‌స్పూన్, పంచదార- 150 గ్రా., డ్రైఫ్రూట్స్ తురుము(జీడిపప్పు, బాదం, పిస్తా)- పావుకప్పు, యాలకుల పొడి- చిటికెడు.
తయారీ: క్యారట్లను బాగా కడిగి తొక్క తీసి, తురిమి పక్కన పెట్టుకోవాలి. మందపాటి కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. దీంట్లోనే క్యారెట్ తురుము వేసి తక్కువ మంట మీద వేయించాలి. గిన్నెలో పాలు పోసి తక్కువ మంట మీద పాలను మరిగించాలి. క్యారెట్ తురుములో పంచదార వేసి ఉడికించాలి. పంచదార పూర్తిగా కరిగి మిశ్రమం గట్టిపడేంత వరకు ఉడికించాలి. పాలను సగం అయ్యేంతవరకు మరిగించి వాటిని క్యారెట్ తురుములో పోసి. ఈ మిశ్రమాన్ని తక్కువ మంట మీద గట్టిపడేంతవరకు ఉడికించాలి. చివరగా యాలకులపొడి, డ్రైఫ్రూట్స్ వేసి దించేయాలి.
ఖర్జూరంతో
కావాల్సినవి: ఖర్జూరాలు- పావుకేజీ, పాలు- కప్పు, పంచదార- రెండు టేబుల్‌స్పూన్లు, నెయ్యి- టేబుల్‌స్పూన్, డ్రైఫ్రూట్స్ తురుము- రెండు టేబుల్‌స్పూన్లు.
తయారీ: ఖర్జూరాల్లోని గింజలను తీసి పాలు పోసుకుని మెత్తని పేస్టులా చేయాలి. కడాయిలో నెయ్యి వేడిచేసి డ్రైఫ్రూట్స్ తురుము వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లోనే ఖర్జూరం పేస్టు వేసి గరిటెతో కలుపుతూ వేయించాలి. పంచదార, యాలకుల పొడి, పాలు పోసి ఉడికించాలి. పంచదార బదులు బెల్లం లేదా తేనె వాడొచ్చు. మిశ్రమం ఉడికి దగ్గరపడిన తర్వాత వేయించిన డ్రైఫ్రూట్స్ వేసి దించేయాలి. చివరగా యాలకుల పొడి వేయాలి.
పెసరపప్పుతో
కావాల్సినవి: పెసరపప్పు, పంచదార- కప్పు చొప్పున, నెయ్యి- ముప్పావు కప్పు, పాలు- అరలీటరు, యాలకుల పొడి- చిటికెడు, కిస్‌మిస్ జీడిపప్పు, బాదం తురుము- రెండు టేబుల్‌స్పూన్‌ల చొప్పున.
తయారీ: పెసరపప్పును తక్కువ మంట మీద దోరగా వేయించి చల్లార్చాలి. దీన్ని మిక్సీజార్‌లో వేసి రవ్వలా చేయాలి. కడాయిలో నెయ్యి వేడిచేసి డ్రైఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. దీంట్లో పెసరపప్పు రవ్వ వేసి తక్కువ మంట వేయించాలి. పాలు పోసి ఉండల్లేకుండా గరిటతో కలుపుతూ ఉడికించాలి. మెత్తగా ఉడికిన తర్వాత పంచదార వేసి బాగా దగ్గరపడేంత వరకు ఉంచాలి. యాలకుల పొడి వేసి బాగా కలిపి చివరగా డ్రైఫ్రూట్స్ వేయాలి. ఇది నాలుగైదు రోజులపాటు నిల్వ ఉంటుంది.
బాదం హల్వా
కావాల్సినవి: బాదంపేస్టు, పచ్చికోవా, పాలు- కప్పు చొప్పున, పంచదార - అరకప్పు, నెయ్యి- నాలుగు టేబుల్‌స్పూన్లు, యాలకుల పొడి- కొద్దిగా, డ్రైఫ్రూట్స్ తురుము- రెండు టేబుల్‌స్పూన్లు.
తయారీ: కడాయిలో నెయ్యి వేడిచేసి బాదం పేస్టు వేసి వేయించాలి. పాలు పోసి కలుపుతూ ఉడికించాలి. తర్వాత పంచదార వేయాలి. ఇప్పుడు కాస్త నెయ్యి, కోవా వేసి బాగా కలపాలి. మిశ్రమం దగ్గరకు వచ్చిన తర్వాత యాలకుల పొడి వేసి దించేయాలి. చివరగా డ్రైఫ్రూట్స్ తురుముతో అలంకరించాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
MLC Kavitha: ఏడున్నర గంటలుగా ఎమ్మెల్సీ కవితను విచారిస్తున్న ఈడీ
-
General News
NTR: ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 నాణెం.. త్వరలో మార్కెట్లోకి
-
World News
Nowruz: గూగుల్ డూడుల్ ‘నౌరుజ్ 2023’ గురించి తెలుసా?
-
General News
Amaravati: అమరావతిలో మళ్లీ అలజడి.. ఆర్ 5జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ
-
Sports News
MIW vs RCBW: ముంబయి ఇండియన్స్ చేతిలో ఆర్సీబీ చిత్తు..
-
India News
Amritpal Singh: ‘ఆపరేషన్ అమృత్‌పాల్’కు పక్షం రోజులు ముందే నిశ్శబ్దంగా ఏర్పాట్లు..!