ఉల్లి కచోరీ

చపాతీ పిండి కోసం కావాల్సినవి: మైదా- రెండు కప్పులు, బొంబాయి రవ్వ- పెద్ద చెంచా, ఉప్పు- అర చెంచా, నెయ్యి- రెండు పెద్ద చెంచాలు, నీళ్లు- అర కప్పు, నూనె- చెంచా.

Updated : 15 Jun 2021 14:22 IST

చపాతీ పిండి కోసం కావాల్సినవి: మైదా- రెండు కప్పులు, బొంబాయి రవ్వ- పెద్ద చెంచా, ఉప్పు- అర చెంచా, నెయ్యి- రెండు పెద్ద చెంచాలు, నీళ్లు- అర కప్పు, నూనె- చెంచా.
ఉల్లి మసాలా కోసం... కావాల్సినవి: ఉల్లిపాయ ముక్కలు- కప్పు, నూనె- మూడు చెంచాలు, జీలకర్ర, సోంపు, ధనియాలు-అరచెంచా చొప్పున, ఇంగువ- చిటికెడు, పచ్చిమిర్చి తరుగు- చెంచా, అల్లంముద్ద- అరచెంచా, కారం, పసుపు, ఆమ్‌చూర్‌, చక్కెర- పావుచెంచా చొప్పున, గరంమసాలా- అరచెంచా, ఉప్పు- తగినంత, సెనగపిండి- పావుచెంచా, కొత్తిమీర తురుము- కొద్దిగా.
తయారీ: ఓ గిన్నెలో మైదా, రవ్వ, ఉప్పు, నెయ్యి వేసి కలపాలి. కొద్దిగా ఉండల్లా అయ్యాక నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి. ఈ ముద్దపై నూనెపోసి అరగంటపాటు నాననివ్వాలి.
పొయ్యి వెలిగించి బాండీ పెట్టాలి. నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, ధనియాలు, సోంపు, ఇంగువ వేసి వేయించాలి. పచ్చిమిర్చి తరుగు, అల్లంముద్ద వేసి మరోసారి కలపాలి. ఉల్లిపాయ ముక్కలు చేర్చి బంగారు రంగు వచ్చే వరకు మగ్గించాలి. ఇప్పుడు కారం, పసుపు, ఉప్పు వేసి  ఉడికించాలి. సెనగపిండిని ఉండలు లేకుండా కలపాలి. దీనికే కొత్తిమీర తురుము జత చేయాలి. సువాసలు రాగానే పొయ్యి పై నుంచి దించేయాలి.

*చపాతీ పిండిని చిన్న గిన్నెలా చేసి ఉల్లిపాయ మసాలా మిశ్రమం వేసి అంచులు మూసేయాలి. దీన్ని చేత్తో వత్తుతూ చిన్నగా వడల్లా ఒత్తుకోవాలి. వీటిని కాగే నూనెలో వేసి రెండువైపులా బంగారు రంగు వచ్చేవరకు  వేయించాలి. వీటిని టొమాటో సాస్‌తో తింటే బాగుంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని