కమ్మని కప్‌ ఆమ్లెట్‌

రకరకాల వంటలు చేయాలంటే బోలెడన్ని దినుసులు, చాలా సమయం పడుతుంది కదా. అయితే ఇక్కడ మీరు చూస్తున్న రెసిపీని చిటికెలో చేయొచ్చు.

Updated : 26 Sep 2021 06:07 IST

రకరకాల వంటలు చేయాలంటే బోలెడన్ని దినుసులు, చాలా సమయం పడుతుంది కదా. అయితే ఇక్కడ మీరు చూస్తున్న రెసిపీని చిటికెలో చేయొచ్చు. ఆకలిగా అనిపించినప్పుడు, ఏవైనా చిరుతిళ్లు తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే సరి.

ఓ కప్పులో కాస్తంత బటర్‌ రాసి గుడ్డు, చిటికెడు చొప్పున చిల్లీ ఫ్లేక్స్‌, మిరియాల పొడి, చెంచా పాలు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. దీంట్లోనే, ఉల్లిపాయ టొమాటో, పచ్చిమిర్చి తరుగు వేసి మరోసారి కలిపి నిమిషంపాటు అవెన్‌లో పెట్టాలి. అంతే చిటికెలో కప్‌ ఆమ్లెట్‌ తయారైపోతుంది. ఇన్‌స్టంట్‌ ఆమ్లెట్‌ను ఆరగించడమే తరువాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని